ప్రేమకూ ఆకర్షణకూ మధ్య సన్నటి గీత ఆమెకు 19 అతనికి 17 ఏళ్లు మధ్యా ప్రేమాయణం

 


అనగనగా అది కేరళలోని పొల్లాచ్చి. అక్కడో ప్రైవేట్ పెట్రోల్ బంకు. అక్కడ పనిచేస్తోంది 19 ఏళ్ల యువతి. ఆ బంకుకు సేల్స్ బాగానే ఉంటుంది. రోజూ చాలా మంది వచ్చి తమ బండ్లలో పెట్రోల్ పోయించుకొని వెళ్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్లలో 17 ఏళ్ల ఓ కుర్రాడు... 19 ఏళ్ల యువతని తల వంకరగా పెట్టి చూసేవాడు. అదో రకం మేనరిజం. అలా చూస్తూ చూస్తూ రోజులు గడిచాయి. 

క్రమంగా ఆ యువతి అతనికి ఆకర్షితురాలైంది. ప్రేమలో పడినట్లు ఫీలైంది. ఆ తర్వాత నుంచి అతను ఎప్పుడొస్తాడా, ఎప్పుడు పెట్రోల్ పోయించుకుంటాడా అని ఎదురుచూడటం మొదలుపెట్టింది. అతను కూడా అలాగే వస్తూ... ఆమెను చూస్తూ ఉంటే కాలం గడిచింది. ఓ రోజు కుర్రాడికి అనారోగ్యం వచ్చి ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కొంపలు మునిగినట్లు ఆస్పత్రికి వెళ్లింది. కుర్రాణ్ని చూసింది. హెల్త్ ఎలా ఉందని అడిగింది. తనకు ఏం కాలేదనీ... చిన్న అనారోగ్యమే అని చెప్పాడు. 

Also Read;-

మోజులో పడి నిలువునా మోసపోయిన డాక్టర్...స్నేహం పెరిగిన తర్వాత పెళ్లిచేసుకుందామంటూ ఉచ్చులోకి

ఆ యువతి నమ్మలేదు. చాలా సీన్ క్రియేట్ చేసింది.మరోసారి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక... కుర్రాణ్ని కలిసింది. మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు నీకు ఏ అనారోగ్యాలూ రానివ్వను. నేను మంచిదాన్ని నన్ను చేసుకుంటే... నీకు అంతా మంచే జరుగుతుంది అంది. ఆ కుర్రాడికి ఏమనాలో అర్థం కాలేదు.

 ఎక్కువ ఆలోచించే టైమ్ కూడా ఇవ్వకుండా దగ్గర్లోని ఓ గుడికి తీసుకెళ్లి... పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత విషయం ఆ కుర్రాడి తల్లిదండ్రులకు తెలిసింది. షాకయ్యారు. ఏటిందంతా అని మండిపడ్డారు. ఆ తర్వాత అతన్ని తీసుకొని పొల్లా్చ్చి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో అమ్మాయిపై కంప్లైంట్ ఇచ్చారు. కుర్రాడికి 18 ఏళ్లు రాలేదు కాబట్టి అతను మైనర్.  మైనర్‌ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం పోస్కో చట్టం ప్రకారం నేరం. వెంటనే పోలీసులు కారువేసుకొని బంకుకు వెళ్లారు.

 పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారనుకుంది. కారు ఎక్కమన్నారు. ఎక్కనంది. ఎందుకు ఎక్కమంటున్నారని ప్రశ్నించింది. స్టేషన్‌కి వెళ్తే అర్థమవుతుందిలే అంటూ మహిళా పోలీసులు కారు ఎక్కించుకొని తీసుకుపోయారు. కట్ చేస్తే మ్యాటర్ అర్థమైంది. జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. ఈ క్రైమ్ కథలో మరో ట్విస్ట్ ఉంది. ఇదే యువతి... ఇంతకుముందు కోయంబత్తూరులో మైనర్‌గా ఉన్నప్పుడు మరో మైనర్ యువకుణ్ని ఇలాగే పెళ్లి చేసుకుందామని బలవంతం చేసింది. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

లక్కీగా ఆ పెళ్లి అవ్వకముందే అక్కడి పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. తిరిగి ఇక్కడా అదే రిపీట్ చేసింది. ఆమెది ప్రేమ కాదనీ ఆకర్షణ మాత్రమే అని పోలీసులు అంటున్నారు. ఆ యువతి మాత్రం తాను నిజంగానే ప్రేమించాననీ... కావాలంటే అతనికి 18 ఏళ్లు వచ్చేవరకూ అగి మళ్లీ పెళ్లి చేసుకుంటానని అంటోంది. ఆ మాటలు నమ్మాలో వద్దో పోలీసులకే అర్థం కావట్లేదు.

Comments