స్నేహితుడని నమ్మి విషయం చెబితే అది కాస్త అక్రమ సంబంధం పెట్టుకున్న..


  అక్రమ సంబంధం విషయం తెలిసిన పాపానికి ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. స్నేహితుడని నమ్మి విషయం చెబితే అది కాస్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్తకు చేరింది.. దీంతో నమ్మక ద్రోహం చేశాడని భావించిన ప్రియుడు స్నేహితుడిని కత్తితో పొడిచాడు.వివారాల్లోకి వెళితే... నగరంలోని షాహినగర్‌కు చెందిన అక్బర్​ఖాన్​, సంతోష్​నగర్​కు చెందిన మహ్మద్​ ఈషా అలీ ఇద్దరు మంచి స్నేహితులు. అయితే అక్బర్​ఖాన్​ గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

ప్రతీకాత్మకచిత్రంకాగా కొద్ది రోజుల క్రితం ఆమెకు మరో వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ అక్బర్​ ఆమెను తరచు కలుస్తున్నాడు.తన స్నేహితుడు, మహిళకు మధ్య ఉన్న సంబంధం గురించి మహ్మద్​ ఈషా అలీ... ఆమె భర్తకు చెప్పాడు.ఈ విషయమై మంగళవారం రాత్రి ఇషా అలీని కలిసి అడిగాడు అక్బర్​ ఖాన్​.(ప్రతీకాత్మక చిత్రం)ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఈక్రమంలో అక్బర్​ఖాన్​ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఈషాఅలీపై దాడి చేశాడు.

Comments