రోజూ ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలను తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో...

  


ప్రతిరోజూ ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ కంటే.. ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితులలో పోషక విలువులు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోజూ ఉదయాన్నే పండ్లు, పిండి పదార్థాలను తీసుకుంటుంటారు. అయితే రోజూ ఉదయాన్నే మొలకలను, పండ్లను తీసుకోవడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలుంటాయి.

 జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా సహయపడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులోని ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపడచడమే కాకుండా.. బరువు తగ్గించడంలోనూ సహయపడతాయి.మొలకెత్తిన విత్తనాలలో తక్కువగా పిండి పదార్థం ఉంటుంది. 

ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆకలి హార్మోన్ గ్రెలిన్‏ను సమతుల్యం చేయడంలో మొలకల విత్తనాలు సహయపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటమిన్స్, ఖనిజాలు, ఐరన్, రాగి, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి రక్తప్రసరణను సరిగ్గా ఉంచుతాయి. ఆక్సిజన్ సరఫరా మెరుగుపరుస్తుంది. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అలాగే శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పతిని పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి రక్తం నుంచి చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తాయి.

 రక్తనాళాలో వాపును తగ్గించే శోథ నిరోధక లక్షణాలను కలిగిస్తుంది. మొలకెత్తిన విత్తనాలు గుండె ఆరోగ్యానికి మంచివి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సీ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నందున చర్మం, జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments