Plz Subscribe to my Channel
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతకంతకు హీటెక్కుతోంది. ఇందులోకి నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఎంటర్ అయ్యాక మరింత రసవత్తరంగా మారింది. పోసాని పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు, విమర్శళు గుప్పిస్తూ.. ఓ నటిని ఇందులోకి లాగారు. పంజాబీ అమ్మాయి, నటి అంటూ పోసాని లేవనెత్తిన అంశం సంచలనంగా మారింది
Plz Subscribe to my Channel
తెలుగు సినీ పరిశ్రమలోని ఓ పవర్ ఫుల్ వ్యక్తి ఆ నటిని మోసం చేశాడని, గర్భవతిని కూడా చేసి.. ఆపై అబార్షన్ చేయించాడని పోసాని ఆరోపించారు. దమ్ముంటే ఆ అమ్మాయికి న్యాయం చేయమని పవన్ కళ్యాణ్‌కు పోసాని సవాల్ విసిరాడు. దీంతో గత రెండు రోజులుగా నటి పూనమ్ కౌర్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పూనమ్ కౌర్‌ను ఉద్దేశించినవేనని తెలుస్తోంది.
అలా పూనమ్ కౌర్ పేరు మొత్తానికి సెన్సేషన్ అయ్యింది. పూనమ్ కౌర్ ఈ విషయంపై పరోక్షంగా స్పందించింది. ఇండస్ట్రీలో గురు అంటే ఒక్కరే.. అది దాసరి నారాయణ రావు గారే.. ఈ రోజు ఆయన ఉన్నట్టు ఆ దేవుడు ఓ సందేశాన్ని పంపించినట్టు అనిపించింది.. మిస్ యూ.. అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాగ్రాం స్టోరీలో పూనమ్ కౌర్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ మహిళ మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఈ వీడియోలో సదరు మహిళ ఏమందంటే.. నేను రేప్‌కు గురయ్యాను..
అందరూ నా శీలంపోయిందని అన్నారు.. నా సిగ్గు పోయిందని అన్నారు.. కానీ తప్పు చేసింది వాడు.. సిగ్గుపడాల్సింది వాడు.. నేను ఎందుకు సిగ్గుపడాలి.. అని ఆ మహిళ చెప్పిన మాటలకు ఆమిర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. చాలా రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన ఈ వీడియోను పూనమ్ కౌర్ ఇప్పుడు షేర్ చేయడంతో కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ పూనమ్ కౌర్ ఏంచేప్పాలనుకుంటుందో మాత్రం ఎవ్వరికి అర్ధం కావడం లేదు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment