బీపీని కంట్రోల్‌ చేయాలంటే ఎటువంటి ఆహారం..తీసుకోవాలి !


 ప్రస్తుతం అధిక మంది బాధపడుతున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. కనీసం 30 ఏళ్లు నిండని వారు కూడా హైబీపీ బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆనారోగ్య అలవాట్లు, మానసిక ఆందోళన, అధిక ఒత్తిడిల కారణంగా ఈ అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ఈ హైబీపీ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

ముఖ్యంగా ఇది హృదయ సంబంధ రోగాలకు కూడా దారి తీస్తుంది. అందుకే, హైబీపీ రాకుండా అత్యంత జాగ్రత్త వహించాలంటున్నారు వైద్య నిపుణులు. మనం రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో బీపీని కంట్రోల్ చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.సాధారణంగా బీపీతో బాధపడేవారు ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 

అలాగే ధాన్యపు పిండిని ఉపయోగించాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చాలని వైద్యులు సూచిస్తున్నారు. 2010 లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తృణధాన్యాలు అధికంగా ఉన్న ఆహారాలు బీపీని కంట్రోల్‌ చేస్తాయని తేలిందన్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె ఆగిపోవడం వంటి ప్రమాదాలను తగ్గిస్తాయని తెలిపారు.వోట్స్ ను పిండిగా మార్చవచ్చు. 

వీటి ద్వారా అనేక రకాల తీపి, రుచికరమైన వంటలను తయారుచేయవచ్చు. ఓట్స్‌ను గ్రైండర్‌లో వేసి చక్కగా పొడిలా చేయాలి. ఓట్స్‌తో తయారుచేసిన వస్తువులు బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. బుక్వీట్ మరొక తృణధాన్యం. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది గ్లూటెన్ రహితమైనది. అలెర్జీ ఉన్నవారు కూడా దీన్ని తినవచ్చు.

 బీపీ రోగులు దీనిని కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు.బార్లీ భూమిపై మొట్టమొదటిగా పండించిన ధాన్యాలలో ఒకటి. ఈ పురాతన ధాన్యాన్ని మళ్లీ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. బార్లీ గడ్డి కుటుంబానికి చెందినది. బీపీని కంట్రోల్‌ చేయడానికి బార్లీ పిండి చక్కగా ఉపయోగపడుతుంది.100 గ్రాముల బార్లీలో 17 గ్రాముల డైటరీ ఫైబర్, 12 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఇంకా గోధుమ పిండి కూడా బీపీని కంట్రోల్ చేస్తుంది. ప్రతి రోజు చపాతీలు తింటే చాలా మంచిది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments