మాస్ట్రో మూవీ రివ్యూ...


  ఈ యేడాది ఇప్పటికే నితిన్ నటించిన ‘చెక్‌’, ‘రంగ్ దే’ చిత్రాలు విడుదలయ్యాయి. కథాపరంగా ‘చెక్‌’ భిన్నమైనదే అయినా విజయం విషయంలో నిరుత్సాహపర్చింది. ఇక లవ్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రంగ్ దే’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మాస్ట్రో’. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ చిత్రం ‘అంథాధూన్’కు రీమేక్ అయిన ‘మాస్ట్రో’ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే పియానో ప్లే చేసే కళ్ళు లేని అరుణ్‌ (నితిన్) అనే ఒంటరి కుర్రాడి కథ ఇది. ఇళయరాజాను అమితంగా ఇష్టపడే అతనికి పియానో అంటే ప్రాణం.

సంగీతంలో ప్రావీణ్యం సంపాదించడం కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తాడు. తన పియానో పాడైపోవడంతో ఓ నైట్ క్లబ్ లో చేరి, పియానో ప్రాక్టీస్ చేస్తూ, కొంత డబ్బుల్ని వెనకేసుకుంటాడు. ఆ క్లబ్ ఓనర్ కుమార్తె సోషియా (నభా నటేశ్‌) అరుణ్ పట్ల ఇష్టాన్ని పెంచుకుంటుంది. అదే సిటీలో ఉండే ఒకప్పటి హీరో మోహన్ (నరేశ్‌), అతని రెండో భార్య సిమ్రాన్ (తమన్నా) ఊహించని విధంగా అరుణ్‌ జీవితంలోకి వస్తారు.

 దాంతో ఈ బ్లైండ్ పియానో ప్లేయర్ లైఫ్ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ చిక్కుల్లోంచి అతను ఎలా బయటపడ్డాడు? అనేదే కథ.మూడేళ్ళ క్రితం బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘అంథాధూన్’ హిందీలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు, అనిల్ థావన్, మానవ్ విజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడి వాళ్ళు ఆదరిస్తారా? అనే సందేహం కొందరికి రాకపోలేదు. పైగా నితిన్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో ఈ థ్రిలర్ మూవీలో నటించి, మెప్పించగలడా? అనీ అనుకున్నారు. కానీ వారి అంచనాలు తప్పు అని నితిన్ తన నటనతో నిరూపించాడు. రాధికా ఆప్టే పోషించిన పాత్రను నభా నటేశ్ సైతం అవలీలగా పోషించింది. నిజానికి టబు పోషించిన థ్రిల్లింగ్ క్యారెక్టరే ఈ సినిమాకు ఆయువు పట్టు. ఆ పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేయడం ఓ రకంగా టఫ్ డెసిషన్. ఆమె సోఫియా పాత్ర పోషించడం తెలుగు వ్యూవర్స్ కు ఓ షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. గత వారం వచ్చిన ‘సీటీమార్’లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా నటించిన తమన్నా… అందుకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేసింది. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

అయితే క్యారెక్టర్ లోని డెప్త్ దృష్ట్యా ఆమె పాత్రకు సొంత గొంతు కాకుండా డబ్బింగ్ చెప్పించి ఉండాల్సింది. ఒకప్పటి కథానాయకుడు మోహన్ పాత్రలోకి నరేశ్ పరకాయ ప్రవేశం చేశారు. ఆయన ఎంపిక చాలా యాప్ట్ గా ఉంది. రెండు మూడు సినిమాలలో నటించి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకుంటున్న జిషు సేన్ గుప్తా పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూట్ అయ్యారు. ఇతర ప్రధాన పాత్రల్లో శ్రీముఖి, అనన్య, హర్షవర్థన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి, దువ్వాసి మోహన్, బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ లహరి తదితరులు కనిపిస్తారు .

Rating;- 2.5/5 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments