ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కట్నంగా ఏకంగా రూ. కోటిన్నర తీసుకున్నాడు.. అయినా అతని ధన దాహం తీరలేదు. ఇంకా కట్నం కావాలని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అంగీకరించకపోవడంతో సొంత భార్య వ్యక్తిగత ఫొటోలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్‌కు దిగాడు ఓ ప్రబుద్ధుడు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ బంజారిహిల్స్లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 11లో నివసిస్తోన్న ఓ మహిళ (24) 2016లో ఎంబీఏ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. ఆ సమయంలోనే ఆమెకు సికింద్రాబాద్‌లోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌కు చెందిన మహ్మద్ ఫర్హాన్(26)తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. 2017లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
Also Read;-
పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం.. ప్రేమించాలంటూ యువకుడి వేధింపులు
ఈ సమయంలో మహిళ తండ్రి రూ. కోటిన్నర కట్నంగా అందించారు. కొన్ని రోజుల పాటు అంతా సవ్యంగా సాగినా ఆ తర్వాత అత్తింటివారి నిజ స్వరూపం బయటపడింది. కట్నంగా ఇచ్చిన నగలను అత్త భద్రపరుస్తానంటూ తీసుకొని ఆమెకు ఇవ్వడం మానేశారు. ఇక పిల్లలు కలగడం లేదని వేధింపులు మొదలు పెట్టడం ప్రారంభించారు. అదనపు కట్నం ఇవ్వాలంటూ అత్తింటి వారు బెదిరించడం ప్రారంభించారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
అంతటితో ఆగని భర్త.. భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడాతనంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేని బాధిత మహిళ గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్తతోపాటు అత్తమామలు ఆయేషా ఉస్మాన్, మహ్మద్ ఒస్మాన్‌లపై వరకట్నం, వేధింపుల కింద కేసులు నమోదు చేశారు
Comments
Post a Comment