మాజీ ప్రేయసి రీఎంట్రీ...8 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. హ్యాపీగా గడుస్తున్న అతడి జీవితంలోకి


 
వారిద్దరికీ ఎనిమిది నెలల క్రితం పెళ్లి జరిగింది.. సంసారం సాఫీగా సాగుతోంది.. అలాంటి సమయంలో అతడి జీవితంలోకి మాజీ ప్రేయసి తిరిగి ప్రవేశించింది.. ఆ విషయం భార్యకు తెలిసింది.. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. అవి రోజు రోజుకూ మరింత పెరిగాయి.. తన భర్త ప్రవర్తనను జీర్ణించుకోలేకపోయిన ఆమె విషం తాగేసింది.. హాస్పిటల్‌కు చేర్చే లోపునే మరణించింది.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. ఇండోర్‌లోని పరదేశిపుర సమీపంలోని జనతా కాలనీకి చెందిన శివమ్, కోమల్ ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కోమల్ కంటే ముందు శివమ్‌కు మరో ప్రేయసి ఉండేది. ఆమెకు బ్రేకప్ చెప్పిన తర్వాత కోమల్‌తో శివమ్ ప్రేమలో పడ్డాడు. అనంతరం పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆరు నెలలు వారి కాపురం సాఫీగానే సాగింది. అయితే శివమ్ మళ్లీ తన మాజీ ప్రేయసిని కలిశాడు. ఆమెతో అఫైర్‌ను కొనసాగించాడు. ఆ విషయం కోమల్‌కు తెలిసింది. భర్తతో గొడవ పడింది. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories ,ఆరోగ్యం

Comments