షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు...అతను ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపెంట్ గా ఉన్నాడు.

 


సెప్టెంబర్ 16న షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు. యూ-ట్యూబర్, ఆర్టిస్ట్ అయిన షణ్ముఖ్ ను మిత్రులంతా షణ్ణూ అని అభిమానంగా పిల్చుకుంటారు. అతను ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపెంట్ గా ఉన్నాడు. 16వ తేదీతో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న షణ్ముఖ్ పై అతని గ్యాంగ్ కు భారీ ఆశలే ఉన్నాయి. కరెంట్ తీగలా కనిపించే షణ్ముఖ్ లో కసితో పాటు చాలా టాలెంట్ ఉందని, అతను తప్పనిసరిగా బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని వాళ్ళంత నమ్ముతున్నారు. అంతేకాదు… నాగార్జున, చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని షణ్ముఖ్ అందుకుంటున్నట్టు మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు ఇదిలా ఉంటే… షణ్ముఖ్ – ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసిన దీప్తీ సునయనతో లవ్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక… నాగార్జున గుచ్చి గుచ్చి అడగడంతో బయట పెట్టాడు షణ్ముఖ్. విశేషం ఏమంటే… 16వ తేదీ రాత్రి సునయన అండ్ టీమ్ షణ్ముఖ్ కు అతని జీవితంలోనే మెమొరబుల్ గిఫ్ట్ ను అందించింది. బిగ్ బాస్ హౌస్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీదకు సునయన, ఆమె స్నేహితులంతా చేరుకుని, బిగ్ బాస్ హౌస్ సెట్లోకి వినిపించేలా… ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ గట్టిగా అరుస్తూ విషెస్ తెలిపారు. అక్కడే కేట్ కట్ చేశారు. ఆకాశంలోకి తారాజువ్వలను వదిలి, బాణసంచా కాల్చి… షణ్ముఖ్ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ హంగామాతో బిగ్ బాస్ హౌస్ లోని షణ్ముఖ్ తో పాటు మిగిలిన పార్టిసిపెంట్స్ సైతం బయటకు వచ్చి.. ఆ కోలాహలాన్ని గమనించారు. షణ్ముఖ్ కు దీప్తి సునయన సోషల్ మీడియా ద్వారానూ తన ప్రేమను తెలియచేసింది. అలానే బిగ్ బాస్ హౌస్ నుండి షణ్ముఖ్ సైతం రియాక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 5కి ముందు జరిగిన ఏ సీజన్ లోనూ ఏ కంటెస్టెంట్ కూ ఇలా బర్త్ డే విషెస్ ఎవరూ చెప్పలేదు. అది దీప్తి సునయన కారణంగా… షణ్ముఖ్ కు లభించిన రేర్ బర్త్ డే గిఫ్ట్ అనే చెప్పాలి.
తన ప్రియురాలు, స్నేహితుల నమ్మకాన్ని నిలబెడుతూ బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ విన్ అవుతాడేమో చూడాలి… ఇదిలా ఉంటే… షణ్ముఖ్ బర్త్ డే సందర్భంగా జరుగుతున్న ఈ హంగామా అంతా చూసి, మిగిలిన హౌస్ మేట్స్ ‘షణ్ణూ… ఏంట్రా ఇది!’ అంటూ ఆటపట్టిస్తున్నారు.

Also Read ;-పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత..17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్


Comments