బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రచ్చ మొదలైంది

 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రచ్చ అప్పుడే మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ లొల్లి స్టార్ట్ చేసిండ్రు. ముఖ్యంగా అమ్మాయిలు ఈసారి సీజన్ లో కుర్రాళ్ల మనసులు దోచేస్తున్నారు. ప్రస్తుతం నామినేషన్స్ లో లేకపోయినా సరే వీళ్లే మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటూ తెగ షేర్లు చేసేస్తున్నారు. వీళ్లలో సిరి హన్మంత్ ఫోటోలు ఎక్కువగా ఇప్పుడు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అందమైన కళ్లతో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెగ ఆకట్టుకుంటోంది సిరి లాస్ట్ సీజన్ లో మహిళా కంటెస్టెంట్స్ కూడా తమ గ్లామర్ తో ఆకట్టుకున్నవాళ్లే. అయితే, సీజన్ 4లో లేడీ బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అని ఆశపడ్డారు. కానీ కుదర్లేదు. అంతకుముందు కూడా సీజన్ 3లో శ్రీముఖి ని లేడీ బిగ్ బాస్ విన్నర్ గా చూద్దామనే అనుకున్నారు. కానీ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యాడు. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

ఈసారి అయినా సీజన్ 5లో ఒక లేడీ బిగ్ బాస్ విన్నర్ అయితే చూడాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ. అందుకే, ఫిమేల్ కంటెస్టెంట్స్ కి అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. ఇప్పుడు సిరికి కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.నామినేషన్స్ అప్పుడు సిరి చాలా స్మార్ట్ గేమ్ ఆడింది. అయితే,ఈసారి తను ఎలిమినేషన్ డేంజర్ లో లేకపోయినా కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్ అందరూ. అందమైన ఫోటోలని సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. టాప్ 5లో ఖచ్చితంగా సిరి ఉండాలని ఇప్పట్నుంచే జోస్యం చెప్పేస్తున్నారు. మరి సిరికి అంత సీన్ ఉందా లేదా అనేది తెలియాలంటే కొన్నివారాలు ఆగాల్సిందే.

Comments