Corona Deta Variant;- కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే మరో సవాల్ ఎదురైంది. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ బలహీనపడిందని అనుకునే సమయంలోనే డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది.. కొత్తగా డెల్టా ప్లస్‌గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. థర్డ్ వేవ్ ముప్పును తట్టుకోవాలని దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసారు.
ఒకవైపు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. కేసులతో పాటు మరణాలు కూడా తగ్గాయి. వీటి నుండి అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్తగా డెల్టా వేరియంట్లు వచ్చి మళ్లీ అందరినీ కలవరానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు.. కోవిడ్ నుండి కోలుకున్న వారిలోనూ రీ-ఇన్ ఫెక్షన్లకు కారణమవుతున్నాయి.ప్రజలు కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా డోసులు వేసుకున్నా సరే డెల్టా వేరియంట్ సోకే ప్రమాదం ఉందని ఎయిమ్ ఢిల్లీ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) ప్రత్యేక అద్యయనం వెల్లడించింది. డెల్టా వేరియంట్ (బి.1.617.2) ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న కరోనా మహమ్మారిలోని కొత్తరకం. ఈ రకం Carona నియంత్రణ కోసం టీకాలు అందుబాటులోకి వచ్చాయి.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిరక్షకాలు కరోనా దాడిని అడ్డుకుంటాయి. అయితే, ఈ టీకాలు చైనాలోని వూహాన్లో పుట్టిన ఒరిజినల్ వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 8 రెట్లు తక్కువ ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.బ్రిటన్‌లో బయటపడ్డ అల్ఫా వేరియంట్ కన్నా ఈ డెల్టా వేరియంట్.. 40 నుంచి 60 శాతం అత్యంత ప్రభావం కలిగి ఉంటుందని, భారత్‌లోని ఎక్కువ ఇన్ఫెక్షన్ల వెనుక దీని ప్రభావం ఉందని ఎయిమ్స్ వెల్లడించింది. డెల్టా వేరియంట్‌పై టీకాల వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు 8 రెట్లు తక్కువగా స్పందిస్తున్నట్లు గుర్తించారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు గమనించారు. అంటే కరోనా టీకాలు డెల్టాపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్నమాట. నాన్–డెల్టా ఇన్ఫెక్షన్లతో పోలిస్తే డెల్టాలో వైరల్ లోడ్ అధికం. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంది. ఇది డామినెంట్ (ఆధిపత్య) వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది.ఐదు నుంచి ఏడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఎమర్జెన్సీ వార్డులో చేరిన కొంత మంది రోగులపై ఎయిమ్స్ వైద్యులు అధ్యయనం నిర్వహించారు. అందులో కొంతమందికి కొవాగ్జిన్ సింగిల్ డోస్ ఇచ్చారు.
మిగతా వారికి కొవిషీల్డ్ సింగిల్ డోస్ ఇచ్చారు. అయితే, ఆశ్చర్యకరంగా సింగిల్ డోస్ తీసుకున్న వారిలో 76.9 శాతం మంది డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్కు గురయ్యారని, డబుల్ డోసులు తీసుకున్న 60 శాతం మంది కూడా ఇన్ఫెక్షన్కు గురయ్యారని తేలింది. అంటే, కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వేసుకున్నప్పటికీ.. డెల్టా వేరియంట్ సోకే ప్రమాదం కొంతవరకు ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ తీసుకున్న వారిలో ఒక్కరు కూడా కరోనా కారణంగా మరణించలేదని అధ్యయనం పేర్కొంది. కరోనావైరస్ డెల్టా వేరియంట్‌ను ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్‌గా చెప్పవచ్చు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment