పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత..17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్

 


ఆమె వయసు 30 సంవత్సరాలు.. భర్తతో కలిసి ఓ బస్తీలో నివసిస్తోంది.. పొరుగింటి బాలుడితో సరదాగా మాట్లాడుతూ ఉండేది.. పదేళ్ల వయసు నుంచి ఆ బాలుడు ఆమెకు తెలుసు.. శుక్రవారం సాయంత్రం ఆ బాలుడు అదృశ్యమయ్యాడు.. తల్లిదండ్రులు ఎంతగా వెతికినా ఆ బాలుడి ఆచూకీ లభించలేదు.. 

పక్కంట్లో నివసించే 30 ఏళ్ల మహిళ కూడా అదే రోజు నుంచి కనిపించలేదు.. దీంతో అనుమానం వచ్చిన బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.. మహారాష్ట్రలోని భివాండీలో ఈ ఘటన జరిగింది. 

భివాండిలోని ఓ బస్తీలో ఉంటున్న తమ 17 ఏళ్ల కొడుకు, తమ ఎదురింట్లో ఉండే 30 ఏళ్ల వివాహితతో కలిసి వెళ్లిపోయాడని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు మైనర్ కావడంతో మహిళపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. 

ఎనిమిదేళ్ల క్రితం తమ పొరుగింట్లో దిగిన మహిళ తమ కుమారుడితో సరదాగా మాట్లాడుతూ ఉండేదని, ఇటీవల తమ కుమారుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. 

Also read ;- 

పక్కాగా ప్లాన్ ఫ్రెండ్ ప్రియురాలిపై కన్నేశాడు..ఇంట్లో లేని సమయంలో ఆమెకు దగ్గరయ్యాడుComments