ఇంట్లోకి దూరి ఆమె జుట్టు కత్తిరించిన 21 ఏళ్ల కుర్రాడు... 19 ఏళ్ల యువతి..


 19 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది.. ఇంతలో ఎదురుంటి యువకుడు ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు.. అతడి చేతిలోని కత్తెరను చూసి ఆ యువతి భయపడింది.. ఆ యువకుడు ఆమె దగ్గరకు వెళ్లి ఆమె జుట్టు కత్తిరించి అక్కణ్నుంచి పారిపోయాడు.. షాకైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేరళలోని ఇడుక్కిలో ఈ ఘటన జరిగింది. ఇడుక్కిలోని ఎస్టేట్ వర్కర్స్ ప్రాంతంలో నివసిస్తున్న సుశీల్ కుమార్ అనే యువకుడు తన ఎదురింట్లో ఉంటున్న 19 ఏళ్ల యువతిపై మనసు పారేసుకున్నాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు ఎన్నోసార్లు చెప్పాడు. 
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories ,ఆరోగ్యం

అన్నిసార్లూ ఆమె సుశీల్ ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆమెపై ఆగ్రహం పెంచుకున్న సుశీల్ సోమవారం ఉదయం ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు. ఓ కత్తెర తీసుకెళ్లి ఆమె జట్టు కత్తిరించేశాడు. ముందు షాకైన బాలిక తర్వాత తల్లిదండ్రులతో విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories ,ఆరోగ్యం

Comments