పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఇంటి మీద పిడుగు 20లక్షల నగదు ఇంట్లో ఉంచామని...

 


ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఇంటి మీద పిడుగుపడి భారీ నష్టం వాటిల్లింది. జిల్లాలోని చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో శనివారం సాయంత్రం ఓ ఇంటిపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో కాళ్ల కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో ఉన్న రూ.20లక్షల నగదు దగ్ధమైంది. 

తమ కుమారుడి చదువు కోసం ఇటీవల పొలం విక్రయించగా.. వచ్చిన రూ.20లక్షల నగదు ఇంట్లో ఉంచామని బాధితులు పేర్కొంటున్నారు. పిడుగు పడటంతో నగదు మొత్తం మంటల్లో కాలిపోయిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు

నగదుతో పాటు ఇంట్లో ఉన్న 50 కాసుల బంగారం కూడా దగ్ధమైందని వాపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also read;-

భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా


Comments