15 ఏళ్ల బాలికపై 9 నెలలుగా 30 మంది అత్యాచారం...


 దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యంత దారుణం జరిగింది. 30 మంది వ్యక్తులు కలిసి 15 ఏళ్ల బాలికపై 9 నెలలుగా అత్యాచారం చేస్తున్న అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. బాధిత బాలిక 33 మంది నిందితులను గుర్తించగా, వారిలో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు బాలురు కూడా ఉండడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. 

బాలిక స్నేహితుడు ఈ ఏడాది జనవరిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా దానిని వీడియో తీశాడు. ఆ తర్వాత దానిని చూపించి బాలికను బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.నిందితుడు అక్కడితో ఊరుకోక, ఆ వీడియోను తన స్నేహితులకు షేర్ చేయడంతో బాలిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారు కూడా ఆ వీడియోను చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడడం మొదలుపెట్టారు. 

ముంబైలోని పలు ప్రాంతాల్లో బాధిత బాలికపై నిందితులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఏసీపీ దత్తాత్రేయ కరాలే ఈ ఘటనపై మాట్లాడుతూ.. బాలిక బాయ్‌ఫ్రెండ్ జనవరిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆ ఘటనను వీడియో తీశాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ వీడియోను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని తెలిపారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి నాలుగైదుసార్లు డోంబివిల్లి, 

బడ్లాపూర్, ముర్బాద్, రాబేల్ తదితర ప్రాంతాల్లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఏసీపీ వివరించారు. బాధిత బాలిక గతరాత్రి పోలీసులను ఆశ్రయించగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం 24 మందిని అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారానికి పాల్పడిన అందరూ దాదాపు ఆమెకు తెలుసని పోలీసులు తెలిపారు. వీరిలో కొందరికి ఓ రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉందని పేర్కొన్నారు. పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments