ఆమె వయసు 15, అతని వయసు 14.. ఇద్దరు ప్రేమించుకున్నారు


 వాళ్లిద్దరు క్లాస్‌మేట్స్.. బాలిక వయసు 15, బాలుడి వయసు 14. ఇద్దరు ప్రేమించుకున్నారు. వారి మధ్య మంచి సన్నిహిత్యం కూడా ఉంది.వాళ్లిద్దరు క్లాస్‌మేట్స్.. బాలిక వయసు 15, బాలుడి వయసు 14. ఇద్దరు ప్రేమించుకున్నారు. వారి మధ్య మంచి సన్నిహిత్యం కూడా ఉంది. అయితే తాను తల్లిని కాబోతున్నని బాలిక.. బాలుడితో చెప్పింది. ఇది విన్న బాలుడు తీవ్రంగా దాడి చేశాడు.

 విచక్షణ మరిచి మృగంలా ప్రవర్తించాడు. మెడ, పొత్తిడకడుపు అనేకసార్లు పొడిచాడు. దీంతో బాలిక ఘటన స్థలంలోనే మరణించింది. ఈ షాకింగ్ ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది. అర్జెంటీనాలోని మెండోజాకు చెందిన బాధిత బాలిక.. తన క్లాస్‌మేట్‌తో శారీరక సంబంధం కలిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బాలిక అతనికి చెప్పింది. అందుకే కారణం అతడేనని పేర్కొంది. దీంతో బాలుడు.. విచక్షణ మరచి ప్రవర్తించాడు. బాలిక తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. 

Also read;-

భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా

అలాగే ఆమె మెడపై, పొత్తికడుపులో పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించింది. అయితే ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత ఓ వ్యక్తి బాలిక మృతిచెంది ఉండటం చూశాడు. పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్నిమిత్తం తరలించారు.

 పోస్ట్‌మార్టమ్ నివేదికలో.. బాలిక తీవ్రంగా కొట్టబడిందని, కత్తి పోట్లకు గురైందని.. ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు.ఇక, బాలిక మృతదేహాన్ని మొదట చూసి వ్యక్తి మాట్లాడుతూ.. బాలిక మరణించడానికి కొద్ది గంటల ముందే అక్కడే ఓ బాలుడితో మాట్లాడటం తాను చూసినట్టుగా చెప్పారు. పోలీసులు తాము సేకరించిన సమాచారం ఆధారంగా బాలుడి ఇంటికి చేరారు. అక్కడ అతని తల్లి సమక్షంలో బాలుడిని ప్రశ్నించారు. 

అప్పుడు బాలుడు తాను నేరం చేసినట్టుగా అంగీకరించాడు. బాధిత బాలికను హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తండ్రి ఫాబియాన్ ఫెర్నాండెజ్ స్పందిస్తూ.. నిందితుడు తన కూతురుని చాలా దారుణంగా హత్య చేశాడని అన్నారు. ఆమె ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. అతనికి కఠినమైన శిక్ష విధించాలని కోరారు.

Also read;-

భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా

స్థానిక నివేదికల ప్రకారం.. బాలికను కలవాలని పిలిచిన బాలుడు.. ఖాళీగా ఉంటున్న ఓ ఇంటి వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో బాలిక అక్కడికి చేరుకుంది. తర్వాత బాలికపై క్రూరంగా దాడి చేసిన బాలుడు, ఆమెను దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు.

అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి, ఘటన స్థలం నుంచి పారిపోయాడు.బాలికను హత్య చేయడానిక బాలుడు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు అతని ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారని డెయిలీ స్టార్ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. బాలుడు ప్రస్తుతం జువైనల్ క్రిమినల్ ప్రాసిక్యూటర్ పర్యవేక్షణలో ఉన్నట్టుగా చెప్పారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments