హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పరిధిలో మహిళ మిస్సింగ్ మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జవహర్‌నగర్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 48 ఏళ్ల మహిళ , భర్త, కుమారుడు, మనవరాలితో కలిసి కాప్రా వంపూగూడలో నివాసం ఉంటోంది. 10 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్‌లో ఓ హోటల్లో పనిచేసేది.
అక్కడే వర్క్ చేస్తోన్న మారేడుపల్లికి చెందిన అశోక్(36)తో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి దారితీసింది. అశోక్ కాప్రా సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. అయితే ప్రియురాలితో గడిపేందుకు సమీపంలోనే మరో సెపరేట్ రూమ్ రెంట్‌కు తీసుకున్నాడు. తనకంటే 12 చిన్నవాడైనప్పటికీ ఆ మహిళ అశోక్‌తో లైంగిక సంబంధం కొనసాగిస్తోంది.
Also Read;-అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు..ఇంతలో
ఈ విషయం ఇటీవల అశోక్ భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో అశోక్ ప్రియురాలిని రెగ్యులర్‌గా కలవలేకపోతున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలు ఇటీవల మరికొందరితోనూ సన్నిహితంగా ఉంటున్నట్లు అశోక్‌కు తెలిసింది. తనను మోసం చేసిన ఆమెను ఖతం చేయాలని డిసైడయ్యాడు. ఈ నెల 5 తేదీన ఆమెను తన రూమ్‌కి రమ్మని చెప్పాడు. దీంతో ఆ మహిళ అక్కడికి వెళ్లింది. ఇంట్లో చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్తున్నానని మనవరాలికి చెప్పింది. వెళ్లిన మనిషి ఎంతసేపటికీ తిరిగిరాలేదు.
రాత్రయినా ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అశోక్‌పై అనుమానం ఉందని వారు ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. తమదైన స్టైల్లో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతోనే ప్రియురాలిని గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకొన్నాడు.
అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు డెడ్‌బాడీని శామీర్‌పేట మండలం లాల్గడిమలక్పేట్ అటవీ ప్రాంతంలో వెలికితీసి ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. అశోక్‌పై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జవహర్‌నగర్ పోలీసులు తెలిపారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment