మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం,... ఊహించని అతడికి రూ.11 లక్షలు ఇచ్చింది


  ఆమెకు అతడు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమయ్యాడు.. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.. ఆమెతో మూడు నెలలు ఫోన్ ద్వారా మాట్లాడాడు.. అనంతరం తను ఆర్థిక కష్టాల్లో ఉన్నానని, డబ్బులు కావాలని అడిగాడు.. దాంతో ఆమె అతడికి రూ.11 లక్షలు ఇచ్చింది.. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు..
పెళ్లి చేసుకున్న తర్వాతి రోజు ఆమెకు మరో షాకిచ్చాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.. చెన్నైలో ఈ ఘటన జరిగింది. చెన్నైకు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి ఓ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా చించ్‌వాడ్‌కు చెందిన మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ ద్వారా ఆమెతో మాటలు కలిపాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. తన ఆర్థిక కష్టాల గురించి చెప్పి ఆమె దగ్గర్నుంచి రూ.11,04,500 తీసుకున్నాడు. ఇటీవల ఆమెను చెన్నైకి పిలిపించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి తర్వాతి రోజు ఆమెకు మరో షాకిచ్చాడు. నీ పేరు మీద రూ.80 లక్షలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించింది. 

Also read ;- 

పక్కాగా ప్లాన్ ఫ్రెండ్ ప్రియురాలిపై కన్నేశాడు..ఇంట్లో లేని సమయంలో ఆమెకు దగ్గరయ్యాడు

Comments