తల్లి అకౌంట్‌లో రూ.10 లక్షలు మాయం..కొడుకు ఆడిన పబ్‌జీ

 


PUBG: గేమైనా ఏదైనా... దాన్ని మనం ఆడించాలే తప్ప అది మనల్ని ఆడించే పరిస్థితి రాకూడదు. ఈ పబ్‌జీ ఆటకు బానిసైతే బతుకు బస్టాండ్ అవ్వడం ఖాయం. ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఇదివరకు చూశాం. తాజాగా మరొకటి ముంబైలో జరిగింది.

 ఆ కుర్రాడి వయస్సు 16 సంవత్సరాలు. ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో ఉంటున్నాడు. గత నెల్లోనే పబ్‌జీ (PUBG) ఆట మొదలుపెట్టాడు. మొబైల్‌పై వేళ్లను వేగంగా కదుపుతూ... ఆట చకచకా ఆడుతూ థ్రిల్ పొందాడు. ఏముంది ఈ గేమ్... ఇలాంటి గేమ్ ఉందని ఇన్నాళ్లూ నాకు తెలియదు... అదిరిపోయింది అని ఆడుతూ ఆడుతూ... తల్లి బ్యాంక్ అకౌంట్ నుంచి గేమ్ కోసం రూ.

10 లక్షలు ఖర్చు పెట్టేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)విషయం ఇంట్లో వాళ్లకు తెలియగానే పారిపోయాడు. తూర్పు అంధేరిలోని మహాకాళీ గుహల దగ్గరకు వెళ్లి దాక్కున్నాడు. అతని కోసం వెతికీ వెతికీ పోలీసులు మొత్తానికి కనిపెట్టారు. తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.బుధవారం సాయంత్రం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పిల్లాడి తండ్రి... MIDC పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పిల్లాడు మైనర్ కాబట్టి... పోలీసులు కిడ్నాప్ కింద కేసు రాశి వెతికారు. పోలీసులు ప్రశ్నలు అడుగుతుంటే... నెల కిందటి నుంచి పబ్‌జీ ఆడుతున్నాడనీ... 

Also read;-

భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా

ఆట ఆడేందుకు ID, వర్చువల్ కరెన్సీ కోసం... తల్లి బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు వాడేశాడని చెప్పడంతో... షాకవ్వడం పోలీసుల వంతైంది.ఓ రోజు తల్లిదండ్రులు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ గమనించగా... డబ్బులు హారతి కర్పూరం అయిన విషయం తెలిసింది. అలా ఎలా ఖర్చు పెట్టేశావురా అని పిల్లాణ్ని తిట్టారు. ఆ తర్వాత ఇంట్లో ఓ లెటర్ కనిపించింది. ఇంట్లోంచీ పారిపోతున్నాననీ... ఇక తన కోసం వెతకవద్దని అందులో ఉంది. ఇది రెండో షాక్ అయ్యింది పేరెంట్స్‌కి.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments