వేరు వేరు సిటీల్లో కాపురాలు 10 మంది భార్యలు...

 


అతడికి పది మంది భార్యలు.. దేశంలోని వేర్వేరు నగరాల్లో ఉంటుంటాడు.. ఎక్కడికి వెళ్లినా ఫైవ్‌స్టార్ హోటల్‌లోనే బస.. విమానాల్లోనే ప్రయాణాలు.. ఖరీదైన కార్లలోనే తిరుగుతుంటాడు.. అలాగని అతడు పెద్ద వ్యాపారవేత్త కాదు.. ఓ గజదొంగ.. ఇటీవలె ఘజియాబాద్ పోలీసులు అతడి ఆచూకీ కనుగొన్నారు.. అతడి పేరు ఇర్ఫాన్. మరో ముగ్గురి సహాయంతో అతను భారీ దోపిడీలు చేస్తుంటాడు. అతడి మీద వివిధ రాష్ట్రాలలో డజనుకు పైగా కేసులున్నాయి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇర్ఫాన్‌కు మొత్తం పది మంది భార్యలు. వారిని వివిధ నగరాల్లో ఉంచాడు. తాజాగా ఓ భార్య పేరు మీద అత్యంత ఖరీదైన జాగ్వర్ కారు కొన్నాడు.  ఆ కారులోనే వెళ్లి తాజాగా కవినగర్‌కు చెందిన స్టీలు వ్యాపారవేత్త కపిల్ గార్గ్ నుంచి కోటి రూపాయలు కొట్టేశాడు. కపిల్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఇర్ఫాన్ భార్య గుల్షన్, అతడి డ్రైవర్ మహ్మద్ షోయబ్‌ను అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి గురించి పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు. 

Comments