భార్య చెళ్లెలు తనను మానసికంగా వేధిస్తున్నారని..తాను ఎందుకు ఆత్మహత్య కు...

 Plz Subscribe to my Channel


భార్య, అత్త, భార్య చెళ్లెలు తనను మానసికంగా వేధిస్తున్నారని, తన కూతుర్ని కూడా తనకు కాకుండా చేసి వేధించారని ఆరోపిస్తూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీస్తూ తాను ఎందుకు ఆత్మహత్య  కు పాల్పడుతున్నది వివరించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. 

Plz Subscribe to my Channel

గుంటూరుకు ఉదయ్‌భాస్కర్‌(45) కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చి ఇక్కడే శేష్‌మహాల్‌ ఏరియాలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆరేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన సోనీతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఉదయ్‌భాస్కర్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం రాత్రి సోనీ పుట్టింటికి వెళ్లింది. 

సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉదయ్‌భాస్కర్‌ ఫేస్‌బుక్‌లో లైవ్‌పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని గుర్తించిన స్నేహితులు బాధితుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకునే సరికే ఆయన మృతిచెందాడు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments