Plz Subscribe to my Channel
అటు ఏపీ మంత్రులు, ఇటు పోసాని కృష్ణ మురళి తన సోదరుడు పవన్ కల్యాణ్‌పై చేస్తు న్న విమర్శలకు నాగబాబు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఏదీ సూటిగా చెప్పకుం డా... మీమ్స్, ఇమోజీలు, వీడియోల రూపంలో తాను చెప్పాల్సింది చెప్పారు. మంగళవారం పోసాని కృష్ణ మురళి వరుసగా రెండోరోజు పవన్‌పై విరుచుకుపడిన అనంతరం...
నాగబాబు ‘ఆస్క్ మీ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాను ల ముందుకు వచ్చారు. ‘మళ్లీ పాలిటిక్స్‌లో వ స్తారా అంకుల్’ అనే ప్రశ్నకు... ‘నాకు ఇంట్రెస్ట్ పోయింది’ అనే మీమ్‌తో ఆన్సర్ ఇచ్చారు. ‘పవన్ కల్యాణ్ మేటర్ మాట్లాడు అన్నా’ అని ఓ అభిమాని అడిగితే... గతంలో పవన్ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన వీడియో పోస్ట్ చేశారు. ‘‘పవన్‌కల్యాణ్ ఈ రోజు మళ్లీ సినిమా హీరోగా యాక్ట్ చేస్తానంటే.. నేను అతనికి బ్లాం క్ చెక్ ఇస్తా.
Plz Subscribe to my Channel
ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. కోటా, రెండు కోట్లా, పది కోట్లా, ఇరవై కోట్లా, 30 కోట్లా! 40 కోట్లు కూడా ఇస్తా. నాకు డేట్స్ ఇస్తే. అంత డిమాండ్ ఉన్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్ హీరోల్లో అతనొకరు.అతను ఐదు కోట్లు, పది కోట్ల కోసం లంగా పనులు చేయడు. నాకు తెలుసు’’ అని అందులో పోసాని అన్నారు. మరో నెటిజన్ ‘సార్... ఏపీ మూవీ టికెట్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని ప్రశ్నించగా... ‘విక్రమార్కుడు’
చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం మో సాలు చేసి డబ్బులు పంచుకునే సన్నివేశాన్ని పోస్ట్ చేశారు. ‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైనా సరిగా పంచావ్‌రా!’ అంటూ బ్రహ్మానందం వాపోయే సీన్ చూపించారు. ‘మోసం చేసినవాడు బాగుపడడురా!’ అని బ్రహ్మానందం శపించగా... ‘ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి’ అని రవితేజ లైట్ తీసుకుంటాడు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment