అన్ని సార్లు ఎడమ చేయి నొప్పి.. గుండె సమస్యలకు కారణం...

 


రోగాల బారిన పడడానికి వయసు తో పనిలేదు. చిన్న పెద్ద అనే తేడాలేకుండా చాలామంది కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి అనేక వ్యాధులను ఎదుర్కొంటున్నారు. అయితే సర్వసాధారణంగా ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు సూచనగా ఎడమ చేయి నొప్పి ఉంటుంది అని అందరికీ తెలిసిందే..హార్ట్ ఎటాక్ వచ్చేముందు ఎడమ భుజం నుంచి చేయి కింద వరకు లాగినట్టు భరించలేని నొప్పి వస్తుంది. ఇక ఛాతి మధ్యలో నొప్పి మొదలై పైకి వ్యాపిస్తుంది. అంతేకాదు మరికొందరిలో ఈ లక్షణాలతో పాటు.. 

ఎడమవైపు దవడ కూడా నొప్పి అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే.. హార్ట్ ఎటాక్ కు రానున్నదని ముందుగా హెచ్చరింస్తున్నట్లు భావించవచ్చు.  అయితే చాలామంది ఈ లక్షణాలు ఏమీ లేకుండానే ఒక్క ఎడమ చేయి నొప్పి వస్తే చాలు తమకు గుండె నొప్పి వస్తుందని భయపడతారు. అయితే అలా ఒక్క ఎడమచేయి మాత్రమే నొప్పి వస్తూనే.. హార్ట్ ఎటాక్ అని భయపడాల్సిన పనిలేదని అంటున్నారు.

 కొంతమందికి కొన్ని అనారోగ్యాల కారణంగా కూడా ఎడమ చేయి నొప్పి వస్తుందని చెబుతున్నారు. మరి ఎడమ చేయి నొప్పిగా ఉండడానికి కారణాలు ఏంటో చూద్దాం..నిద్రపోయే సమయంలో నిద్రించే భంగిమ సరిగ్గా లేకయినా ఎడమచేయి నొప్పి వస్తుంది.*ఇక కంప్యూటర్ దగ్గర పనిచేసేవారు కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోయినా ఎడమ చేయి నొప్పిగా అనిపిస్తుంది.  కనుక వీటిపై దృష్టి పెట్టి.. 

ఆ భంగిమను సరి చేసుకుంటే ఎడమ చేయి నొప్పి తగ్గుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినా కొన్ని సార్లు ఎడమ చేయి నొప్పి వస్తుంటుంది. దీన్ని తగ్గించుకోవాలంటే రక్త ప్రసరణ మెరుగుపడే విధంగా తగిన వ్యవయం చేయాలి. మంచి ఆహారం తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్నారు వీటికి దూరంగా ఉండడం మంచిది. ఇక ఎక్కువ సార్లు టీ, కాఫీలు తాగడం తగ్గిస్తే మంచిది. అంతేకాదు రోజూ శరీరానికి సరిపడే మంచి నీరుని తాగాలి.  శరీరానికి విశ్రాంతినిస్తూ.. 

సమయానికి నిద్ర పోవాలి. దీంతో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.అయితే కొన్ని సార్లు ఎడమ చేయి నొప్పి గ్యాస్‌, అసిడిటీ సమస్య వల్ల కూడా వస్తుంటుంది. అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన విధంగా చికిత్స తీసుకోవాలి కొంతమంది క్యాన్సర్ బాధితుల్లో కూడా ఎడమ చేయి నొప్పి అధికంగా ఉంటుంది. దీనికి కారణం చికిత్స సమయంలో తీసుకునే కీమో థెరపీ మందులు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్ డ్రగ్స్‌ను ఎక్కువగా వాడడం. 

అందుకనే ఇటువంటివారు ఎడమ చేయి నొప్పితో ఇబ్బంది పడుతుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన విధంగా చికిత్స తీసుకోవాలి.పైన తెలిసిన జాగ్రత్తలు తీసుకుని ఎడమ చేయి నొప్పిని తగ్గించుకోవచ్చు. అప్పటికీ ఎడమ చేయి నొప్పి తగ్గకపోతే ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లెమ్ గా అనుమానించాలి.. వెంటనే గుండె సంబంధిత వైద్యుని వద్దకు వెళ్లి.. తగిన చికిత్స తీసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్ నుంచి బయటపడవచ్చు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments