అక్కడికక్కడే మృతి చెందగా.. చెల్లికు తీవ్రగాయాలయ్యాయి

 


సోదరిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తున్న అన్న...రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఈ ఘటన కంటతడిపెట్టించింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న బత్తిన మౌనికను...తన అన్న కుమారస్వామి ద్విచక్ర వాహనంపై పరీక్షా కేంద్రం వద్దకు తీసుకెళ్తున్నాడు. పరీక్ష కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి అక్కడికక్కడే మృతి చెందగా.. మౌనికకు తీవ్రగాయాలయ్యాయి.

Also Read ;-పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత..17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్

 సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్స కోసం గుంటూరు తరలించారు. కుమారస్వామి చిలకలూరిపేటలో టీ స్టాల్ నడుపుతూ.. కుటుంబానికి అండగా ఉంటున్నారు. పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న సోదరుడు మృత్యువాత పడటంతో ఆ సోదరి విలవిలలాడిపోయింది.  

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments