SR కళ్యాణ మండపం మూవీ ఫస్ట్ రివ్యూ

 SR కళ్యాణ మండపం.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ చిన్న సినిమా ప్రమోషనల్ వీడియోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో.., SR కళ్యాణ మండపం మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీధర్ గాదే దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీలో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవల్కర్ హీరో, హీరోయిన్ గా నటించగా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. మరి.. రొమాంటిక్, యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘SR కళ్యాణ మండపం’ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.కళ్యాణ్.. అందరిలానే ఓ సాధారణ మధ్యతరగతి కుర్రాడు. అప్పటి వరకు అతని జీవితంలో విలన్ ఎవరైనా ఉన్నాడంటే అతని తండ్రే. ఒకే ఇంట్లో ఉన్నా.., కళ్యాణ్ తన తండ్రితో మాట్లాడడు. కళ్యాణ్ తండ్రి తాగుడికి బానిసై, కుటుంబ పోషణని పట్టించుకోవడం లేదని అతని బాధ. కానీ.., గుండెల్లో నాన్న అంటే విపరీతమైన ప్రేమ. ఈ ఎమోషనల్ జర్నీ కొనసాగుతుండగా, కళ్యాణ్ కి కాలేజీలో సింధు అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ప్రేమని దక్కించుకోవడానికి కళ్యాణ్ అన్నీ విధాలా ప్రయత్నాలు చేస్తుంటాడు.

సరిగ్గా.., ఇలాంటి సమయంలో కళ్యాణ్ జీవితంలో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితిలు వస్తాయి. ఇందుకోసం SR కళ్యాణ మండపం’లో పెళ్లిళ్లు చేసి.., డబ్బులు సంపాదించాలి అనుకుంటారు కళ్యాణ్, అతని మిత్ర బృందం. కానీ.., ఇక్కడ ఓ లోకల్ పొలిటీషియన్ ఎంటర్ అవ్వడంతో కళ్యాణ్ లైఫ్ తలకిందులు అయిపోతుంది. ఊరిలో అందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి.. తనకి ఎదురైన కష్టాన్ని కళ్యాణ్ ఎలా అధిగమించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? అన్నిటికీ మించి తన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు అన్నది ఈ చిత్ర కథ.తెలుగు సినిమా అంటేనే ఎమోషన్స్ మెండుగా ఉండాలి. SR కళ్యాణ మండపంలో ఇలాంటి ఎమోషన్స్ కి కొదవే ఉండదు. అయితే..,ఇవి మరీ ఎక్కువ అయిపోయాయి. హీరో తన తండ్రిని మార్చుకోవాలి, హీరోయిన్ ప్రేమని దక్కించుకోవాలి, విలన్ అడ్డు తొలగించుకుని తన లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి. ఒక్క టికెట్ మీద మూడు సినిమాలు అనమాట. నిజానికి ఇలాంటి లేయర్స్ ఉన్న కథని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకుంటే .. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

అన్నీ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ.., SR కళ్యాణ మండపంలో అన్నీ సీక్వెన్స్ లు బాగా వచ్చాయి. కానీ.., ఇదే ఆ చిత్రానికి కాస్త మైనస్ అయ్యింది.ముఖ్యంగా కథలో మిగతా ఎమోషన్స్ బలంగా కుదరడంతో హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పూర్తిగా తేలిపోయింది. కథలో ఉన్న కొన్ని లోపాల కారణంగా కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. అయితే.., ఇవి కొంత మేర మేరకే. క్లయిమ్యాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ వీటంన్నింటిని మర్చిపోయేలా చేస్తుంది. రచయతగా అంత ప్రావీణ్యం లేని కిరణ్ అబ్బవరం కథలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉన్నా, శ్రీధర్ గాదే కథపై ఇంకాస్త ఫోకస్ పెట్టున్నా SR కళ్యాణ మండపం వేరే రేంజ్ లో ఉండేది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

Comments