మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు దోపిడి చేయాలంటే భౌతికంగా రంగంలోకి దిగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంతా వర్చువల్ అయిపోయింది. మనం ఎలాగైతే వర్చువల్గా ఫోన్లో వీడియోకాల్స్ రూపంలో మాట్లాడుకుంటున్నామో నేరగాళ్లు కూడా అలాగే వర్చువల్ మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రపంచంలో ఏదో మూలన కూర్చొని మన ఖాతాల్లోని డబ్బులను కొట్టేస్తున్నారు. అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకునేంత వరకు మోసపోయామని తెలియని పరిస్థితులు వచ్చాయి. అయితే కొన్ని సైబర్ నేరాలకు నేరగాళ్ల తెలివి కారణమైతే మరికొన్ని మాత్రం మన అత్యాశే కారణంగా మారుతుంది.AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs , University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories
ఏదైన వస్తువు తక్కువ ధరకు వస్తుందంటే చాలు వెనకాముందు చూసుకోకుండా జనాలు ఎగబడుతున్నారు. అది అసలు వెబ్సైటా..? నకిలీ వెబ్సైటా.? అని కనీస ఆలోచన లేకుండా షాపింగ్ చేసేస్తున్నారు. దీనినే ఆసరగా చేసుకొన్ని కొందరు సైబర్ నేరస్థులు జనాలకు కుచ్చు టోపీ పెడుతున్నారు. రూ. 5000 వేలకు లభించే వస్తువును కేవలం రూ. 500లకే అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అంత తక్కువ ధరకు వస్తున్నాయంటూ కొనుగోలు చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే నేరగాళ్లు మనం కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్న కార్డుల వివరాలను కాజేస్తూ అకౌంట్లోని డబ్బులను కొట్టేస్తున్నారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs , University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories
తాజాగా ఇలాంటి కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాము ఫేక్ ఫేబ్సైట్ల ద్వారా మోసపోయామని ఫిర్యాదు చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా వినియోగదారులను అలర్ట్ చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తక్కువ ధరకు వస్తువులు అంటూ మోసం చేస్తోన్న కొన్ని ఫేక్ వెబ్ సైట్ల జాబితాను విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన ఆ జాబితాలో ఉన్న ఫేక్ వెబ్సైట్లు ఇవే..
AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs , University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories
1) డేబెట్
2) అమెజాన్93.కామ్
3) ఈబే19.కామ్
4) లక్కీబాల్
5) EZ ప్లాన్
6) సన్ఫ్యాక్టరీ
7) ETC
Comments
Post a Comment