ప్రేమకి పెద్దలు అడ్డు చెప్పారు.. ప్రాణానికి ప్రాణం అయిన ప్రియురాలు మరణం తట్టుకోలేక...

 ప్రేమంటే కలసి బతకడం. ఒకవేళ పరిస్థితిలు సహకరించక విడిపోతే ఒకరి బాగుని మరొకరు కోరుకోవడం. అంతే తప్ప స్వచ్ఛమైన ప్రాణాలను కోరుకోదు. కానీ.., తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమ జంట ఇలాంటి విషాదంగా తమ ప్రేమని ముగించారు. 


ఆ వివరాల్లోకి వెళ్తే..
సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో పవన్, మౌనిక ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే.., వీరి ప్రేమకి పెద్దలు అడ్డు చెప్పారు. వీరిద్దరూ ఎంత వేడుకున్నా పెద్దల హృదయాలు కరగలేదు. దీంతో ముందుగా మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కానీ.., ఈ నిజాన్నిపెద్దలు ముందుగా పవన్ కి తెలియనివ్వలేదు. తనతో మాట్లాడకుండా మౌనికని నిర్బంధించారని పవన్ రెండు రోజులు ఎదురుచూశాడు. కానీ.., స్నేహితుల ద్వారా అతనికి అసలు విషయం తెలిసింది.

 AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

తన ప్రాణానికి ప్రాణం అయిన ప్రియురాలు మరణం తట్టుకోలేక పవన్ మనస్తాపం చెందాడు. మౌనిక లేని లోకంలో తాను ఉండలేను అంటూ ప్రియుడు పవన్‌ కూడా పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. లైవ్ లోనే అతను పురుగుల ముందు తాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెండు రోజుల వ్యధిలో ప్రేమికులిద్దరూ ప్రాణాలు వదలడంతో హుజూర్‌ నగర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

 AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

Comments