ఇచ్చిన బాకీ అడిగినందుకు దారుణానికి ఒడిగట్టారు..ఆటో డ్రైవర్


 
AP;- Guntur జిల్లా మంగళగిరి సమీపంలో ఓ Auto Driver.. మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇచ్చిన బాకీని చెల్లించమని అడిగినందుకు.. కాలితో ఎగిరి తన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

Tadepalli మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం Vijyawada రాణిగారి తోటలో నివాసం ఉంటోంది. అయితే, మహానాడులో ఉండగా తాపీ మేస్త్రీగా పని చేసే చిర్రావురికి చెందిన Gopi Krishna అనే యువకుడికి రూ. 3 లక్షల నగదు వడ్డీకి ఇప్పించింది. అప్పటి నుంచి అప్పు తీర్చమని అడుగుతున్నా.. Gopi Krishna పట్టించుకోవడం లేదు. 

దాంతో ఇక లాభం లేదనుకున్న మహిళ.. చిర్రావురుకు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని గోపీ కృష్ణను అడిగింది.

అయితే, Gopi Krishna.. ఆ మహిళను తన ఆటోలో జనంసచారం లేని కృష్ణ కరకట్ట వద్దకు తీసుకువచ్చాడు. అక్కడ డబ్బుల గురించి అడగ్గా.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కృష్ణ.. కాలితో ఎగిరి తన్నటంతో.. మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ వ్యవహారాన్నంతా మహిళతో వచ్చిన మరొకరు వీడియో తీశారు.

 కాగా, కృష్ణ తీరుపై 100 కి Dial చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళను చికిత్స నిమిత్తం మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటన చిర్రావూరు, రామచంద్రపురం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న Policeలు దర్యాప్తు చేస్తున్నారు.

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

Comments