పాగల్ మూవీ రివ్యూ....

 కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో విశ్వక్ సేన్. ఈయన తాజాగా నటించిన పాగల్ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాతో థియేటర్స్ తెరిపిస్తా. సినిమా ఆడకుంటే పేరు మార్చుకుంటా అని శపథం కాసి మరీ ఈ మూవీని రిలీజ్ చేశాడు విశ్వక్. మరి.. 

పాగల్ మూవీ విశ్వక్ సేన్ నమ్మకాన్ని నిలబెట్టిందా? విశ్వక్ కి కొత్త పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేసిందా? ఈ విషయాలన్నీ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో అమ్మకన్నా ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేరు. ఇది ప్రేమ్‌ నమ్మకం. అతనికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. కానీ.., ఏడేళ్ల వయసులోనే అమ్మని కోల్పోతాడు ప్రేమ్‌. అమ్మ ప్రేమని అమ్మాయి ద్వారా పొందాలి అనుకుంటాడు. 

దీంతో.., కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్‌ చేస్తుంటాడు. కానీ.., అంతా ప్రేమ్ ప్రేమని అర్ధం చేసుకోరు. అతన్ని డబ్బు కోసం మాత్రమే ఇష్టపడుతుంటారు. ప్రేమ్‌.. చివరకు రాజకీయ నాయకుడు రాజీతో ప్రేమలో పడతాడు.  పురుషుడైన రాజీని ప్రేమ్‌ ఎందుకు లవ్‌ చేశాడు? అతని జీవితంలోకి తీర (నివేతా పేతురాజ్‌) ఎందుకు వచ్చింది? అమ్మ లాంటి స్వచ్ఛమైన ప్రేమ కోసం వెతికిన ప్రేమ్‌ కథ చివరికి ఏమైందన్నదే మిగిలిన కథ.విశ్వక్ సేన్ ఈ సినిమాపై ఇంత నమ్మకంగా ఉండటానికి కారణం ఏమిటి అంటే..? ఈ సినిమాలో అతను నటించిన తీరు. లవర్ బాయ్ క్యారెక్టర్ లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా దుమ్ము దులిపేశాడు. ఈ పెర్ఫార్మెన్స్ చూసుకునే విశ్వక్ అంత దైర్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడి ఉండవచ్చు.

ఇక ఈ సినిమాకి ప్రాణం పోసింది మురళీ శర్మది. ఎమ్మెల్యే అభర్థిగా పోటీ చేస్తూ.. హీరో చేతిలో టార్చర్ అనుభవిస్తూ., ఈ క్యారెక్టర్ మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నివేతా పేతురాజ్‌ అందానికి ఫుల్ మార్క్స్ పడతాయి. నివేతా పేతురాజ్‌ పాగల్ తరువాత కూడా సైడ్ క్యార్టక్టర్స్ ఒప్పుకుంటే ఆమె కెరీర్ ని ఆమె చెడకొట్టుకున్నట్టు అవుతుంది. రాహుల్‌ రామకృష్ణ, మహేశ్‌లు కామెడీతో మెప్పించారు. . సిమ్రాన్‌ చౌదరి నటనలో తేలిపోయింది.తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం వెతికే ఓ యువకుడి కథ ఇది. వినడానికి కూడా చాలా ఫ్రెష్ గా అనిపించే లైన్. కథా, కథనాలు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.., 

ఒక “మనసంతా నువ్వే” రేంజ్ రావాల్సిన సినిమా. కానీ.., అనవసరపు కామెడీ కోసం ప్రయత్నించి.. దర్శకుడు కథలో ఉండాల్సిన ఎమోషన్ ని దారుణంగా దెబ్బ తీశాడు. అమ్మ కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ ఎంత బలంగా ఉంటే కథకి అంత పట్టు దొరికేది. కానీ.., అక్కడ కూడా కామెడీ కోసం ప్రయత్నం చేసి.., దర్శకుడు  నిరుత్సాహపరిచాడు. కామెడీగా నడిచిన ఫస్ట్ అంతా ఓకే అనిపించగా, 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. కానీ.., సెకండ్ ఆఫ్ అంతా సో.. సో గా సాగడం, క్లయిమ్యాక్స్ తేలిపోవడంతో పాగల్ స్థాయి పడిపోయింది. టెక్నీకల్ గా గాని.., ప్రొడక్షన్ పరంగా గాని పాగల్ మూవీలో ఎలాంటి పొరపాట్లు లేవు. దర్శకుడు నరేశ్ కథ విషయంలోనే ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.

Comments