వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి ఇంతకంటే మంచిది వేరేది లేదు

 మనమందరం సాధారణంగా పెరుగును మన ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నాం. మన ఆహారంలో ఇది ఓ అంతర్భాగం. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి ఇంతకంటే మంచిది వేరేది లేదు కొంతమంది దీనిని తీపిగా తినడానికి ఇష్టపడతారు. మరికొంతమంది దీనిని సుగంధ ద్రవ్యాలతో తినడానికి ఇష్టపడతారు. వేసవిలో నిర్జలీకరణాన్ని తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగులో పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి పనిచేసే అనేక పోషకాలు ఉన్నాయి. అయితే ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుందని మీకు తెలుసా? ఏంటి నమ్మబుద్ది కావడంలేదా.. అయితే అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందం..

ఆరోగ్యకరమైన బీఎంఐ కోసం..
కాల్షియానికి ప్రధాన మూలం పెరుగు. ఇది బీఎంఐని నియంత్రించడంలో సహాయపడుతుంది. పెరుగును ఆహారంలో చేర్చి, ప్రతిరోజు తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కడుపు నిండినట్లు..
బరువు తగ్గడానికి చాలామంది ఎక్కువ ప్రోటీన్‌లు ఉన్న ఫుడ్‌ను తింటారని మనకు తెలిసిందే. అయితే, పెరుగులో తక్కువ కార్బోహైడ్రేట్లు, 
అధిక ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి సరైన కాంబినేషన్. ఇందులో ఉండే ప్రొటీన్ మీ బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. అలాగే కండరాలను పటిష్టం చేసేందుకు సహాయపడుతుంది.

జీవక్రియను పెంచుతుంది
జీవక్రియ పెంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది తగినంత పోషకాలను కలిగి ఉంది. మనకు కావాల్సిన శక్తిని అందించేందుకు కీలకంగా పనిచేస్తుంది.

 AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

పెరుగును ఎలా తినాలి…
పెరుగును మన ఆహారంలో ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని సులభమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం..
* మీరు భోజనం లేదా విందులో ఒక గిన్నె పెరుగు తినవచ్చు. ఇది కాకుండా, అల్పాహారం కోసం స్మూతీగా ఉపయోగించవచ్చు.
* పండ్లు, కూరగాయలతో రైతా చేసుకుని పెరుగును తినొచ్చు. ఇది కాకుండా, గ్రేవీని చిక్కగా చేయడానికి పెరుగును ఉపయోగించవచ్చు.
* చక్కెర లేదా సుగంధ ద్రవ్యాలు జోడించడం ద్వారా పెరుగు తినవచ్చు. అయితే, చక్కెరను జోడించడం ద్వారా పెరుగులో కేలరీలు పెరుగుతాయి. రోజూ చక్కెరతో కలిపిన పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరం.
* వేసవిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేట్ గా ఉంచడానికి లస్సీగా లాగించేవచ్చు.

UPSC recruitment 2021 Lastdate;-13-8-2021 
Comments