బ్లూ టూత్‌ హెడ్‌ఫోన్‌ ఓ ప్రాణం తిశాయి....

Jaipur;- వైర్‌లెస్‌ Bluetooth హెడ్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలి ఆ శబ్ధానికి ఓ బాలుడు గుండె ఆగిపోయింది.  గుండెపోటుతో బాలుడు మృతి చెందడం దేశంలోనే మొదటిగా వైద్యులు పేర్కొంటున్నారు. 

ఈ సంఘటన రాజస్థాన్‌లోని Jaipur జిల్లా చౌము మండలం ఉదయ్‌పుర గ్రామంలో చోటుచేసుకుంది. Bluetooth హెడ్‌ఫోన్‌ ఓ బాలుడి ప్రాణం తిశాయి. Bluetooth హెడ్‌ఫోన్స్‌ సహాయంతో ఫోన్‌లో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా పేలడంతో 15 ఏళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. జైపూర్‌లోని చోము ప్రాంతంలోని ఉదైపురియా గ్రామానికి చెందిన రాకేశ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ని చెవిలో పెట్టుకుని ఫోన్‌ కాల్ మాట్లాడుతున్నాడు.

 AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

  హెడ్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలడంతో కుప్పకూలిపోయాడు.పేలుడు ధాటికి యువకుడి రెండు చెవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అపస్మారకస్థితిలో పడిపోయిన రాకేశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతనికి చికిత్స అందిస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రుండ్లా మాట్లాడుతూ బాలుడు గుండెపోటుతో మరణించాడన్నారు. Bluetooth ఇయర్ ఫోన్స్ పేలి చనిపోవడం దేశంలో ఇదే మొదటిసారి కావొచ్చని అని అధికారులు పేర్కొన్నారు.

 Bluetooth ఇయర్ ఫోన్స్ పేలి  మృతి చెందాడన్న వార్త సంచలనంగా మారింది.ఇదేమీ మొదటి ఘటనకాదనీ రెండు నెలల కిందట ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. జూన్‌ నెలలో 38 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి Bluetooth పేలి మృతి చెందాడు. బ్లూ టూత్‌ పరికరం పేలుడుతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ పేలిన బ్లూటూత్‌ పరికరం ఏ కంపెనీదో? ఎందుకు పేలుతుందో అనే వివరాలు తెలియడం లేదు.

 AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

Comments