నీవు ప్రేమించు మించక పో..నిను ప్రేమిస్తూనే ఉంటా.....

తొలిసారి నిను చూసిన క్షణం నాలో మృోగిన హంసా నందిని రాగాలు...ఆకర్షణో ప్రేమో అని ఆలోచించే లోపు నీకు చెప్పెయ్యలనే ఆత్రం..ఆ సమయంలో ఏది ఏమైనా అనిపించే తెలియని తనం..నీతో చెప్పేలా చేసింది..నాకు ఇలాంటివి సరిపడవు.అనే నీ జవాబు కు.

బహుశా నాకే ఆ పరిణతి..పరిపక్వత రాలేదు అని సరిపెట్టుకున్న.కానీ నీకు నిజంగానే నా మీద ప్రేమ లేదని నాకేం తెలుసు.అయినా నిను ప్రేమిస్తూనే ఉంటా.బహుశా నా ప్రేమ గుడ్డిది..తిరిగి తీసుకుంటేనే ప్రేమా ఏమిటీ...అని..నిన్నే చూస్తూ నీమీద రాసుకున్న కవితలు,రాతలు...నీ మీద నా ప్రేమ ఎంత లోతైనది..చెప్పేస్తే..ఆ ప్రేమ విలువను తక్కువ చేసినట్టే..ఎందుకంటే..

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

నీ మీద నా ప్రేమ ను వర్ణించడానికి హృదయం లోని ఆ అనుభూతిని చెప్పడానికి కొత్తగా వర్ణమాల తయారు చేయాలి ఏమో..నీవు..ఎందుకంటే.

ఆ హృదయ తంత్రులు వీణను మీటేది నీవే కదా.ప్రేమ అయినా ఏదైనా ఆశించక పోవడం అప్పటి నుండే అలవాటు అయినట్టు వుంది నాకు..అందుకే .నీకు సంబంధం లేకుండా..నిన్ను ప్రేమిస్తు వెళ్తున్న..రాసేస్తూ పోతున్న.

నా ప్రమేయం ఏమీ లేకుండా నీవు చదివిన నా రాతలు నా తల రాతను మారుస్తాయి అని..నిను నాకు చేరువ చేస్తాయని నాకేం తెలుసు..


నా మీద నీ ప్రేమకు ..ఏమివ్వగలను ..నీ మీద అసూయగా వుంది...అంత ప్రేమా నేనంటే.. అన్న నీ మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతున్న యి.నీవంటే నా మీది ప్రేమను భావవ్యక్తీకరణ చేయగలవు...

మరి నేను నా స్వచ్చమైన నవ్వునే ప్రేమగా ఇవ్వగలను అన్నట్టు గా వుండే నీ చూపుల వెలుగులు చెప్పకనే చెప్తున్నాయి...భాష లేని భావమున్న ప్రేమ వూసులు..


ఎట్టకేలకు మన పెళ్లి అయితే..నాకు ప్రపంచాన్నే జయించినట్టు,అలెగ్జాండర్..the great లాగా నేను అనుకొన్న..నాకేం తెలుసు అతను కూడా పోయేటప్పుడు వట్టి చేతులు,ఖాళీ మనసు తో వెళ్ళాడని.నాకు ఏదో కోపం వచ్చి,బాధ కలిగి మౌనంగా ఉంటే,అది ఇగో అని,పోగరని నీ మానాన నీవు వూహించుకొంటే..నా ప్రేమ,నా నిజాయితీ నిరూపించు కోవడమే ఒక పోరాటం.

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

నీవు ప్రేమించు మించక పో..నిను ప్రేమిస్తూనే ఉంటా.. ఎందుకంటే.బహుశా నా ప్రేమ పిచ్చిది.అందుకే నా మీద నీ ప్రేమ నీ వెదుకుతూ వుంటా.  ప్రేమికుల మధ్య పెళ్లి అయ్యాకా   మనస్పర్ధలు ఎందుకొస్తాయి...ఒకరి మాట ఒకరు జవడాటకూడ దు అనే మొండి తనం.వేరు వేరు కుటుంబ నేపథ్యం లో పెరిగిన మన ఆలోచన విధానం ఒక్కలా ఎందుకు వుంటుంది..

జీవన గమనం సాగే కొద్ది ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ ఒకరి కోసం ఒకరు తెలియకుండా ఎవరి ప్రమేయం లేకుండానే అసంకల్పిత ప్రతీ కార చర్య లాగా మారి..అందులో ఇగో ఫీల్ అయ్యే అవకాశం మనసుకు ఇవ్వకూడదు..


నేనేదో నిన్ను ప్రేమిస్తూ..నన్ను నేను కోల్పోతున్న అనుకొనే స్థితి లో ఏ అర్ధ రాత్రో అలసిపోయి పడుకొన్న నన్ను తల నిమురుతూ నుదిటి మీద ముద్దు పెట్టి,నా పాదాలు ఒత్తీ నప్పుడే...నా గుడ్డి ప్రేమ కళ్ళు తెరచి చూస్తే.. నన్ను మించిన గొప్ప ప్రేమికుడి 

వి..నీవు అనుకొన్న...బహుశా నీ ప్రేమ మూగది. ఎందుకంటే మౌనం మాత్రమే దాని భాష కదా మరి.అప్పటి నుండి ప్రేమా నీ చిరునామా ఎదమ్మ అని వెదకడం మానేశా.


నీ చల్లని చూపు,తీయని నవ్వు, స్వచ్ఛమైన నీ సాంగత్యం, వెచ్చని నీ ఊపిరి..పిచ్చిదానా ఇదే నీకు అతడు అందించే అంకిత భావంతో కూడిన ప్రేమని నాకు చెప్పేశా యి.


కానీ మన ప్రేమ ప్రేమించక పోతే యాసిడ్ పోసేదో..ఒప్పుకోక పోతే చంపేసే దొ,వ్యక్తిత్వాలు కలవక పోతే విడిపోయే ప్రేమలా బలహీనమైన ది..కాదు..అసలు ప్రేమ స్వరూపమే బలహీనం కాదు..ఎవరికి వారు స్వార్థం తో దాని అస్తిత్వాన్ని ,స్వరూపాన్ని నాశనం చేస్తున్నారు.. అసలు ప్రేమంటే...అది ఏ రూపంలో అయినా ఇవ్వటమే...తీసుకోవడం కాదు.. ఇస్తూ పోతుంటే..మనకు తిరిగి అదే వస్తుంది... ఏది ఇస్తే అదే గా వచ్చేది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా స్థిరంగా వుంటూ జీవితాంతం ఆ ప్రేమను నిలుపుకోవడమే నిజమైన ప్రేమకు గుర్తింపు.

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

.  మన ప్రేమలో కూడా, విభిన్న మనస్తత్వాలు అయినా ఒకరి అలవాట్లు ఒకరు స్వీకరిస్తూ,ఒకరి లోపాలు ఒకరు ignore చేస్తూ,ఒకరి బలహీనత ఒకరు ప్రేమిస్తూ..

ఒకరి కోసం ఒకరు గా సాగిపోతోంది..balancing gaa..ఆదర్శంగా..స్ఫూర్తితో..అందుకే ప్రేమ ఎక్కడమ్మా..నీవు అని వెదకడం మానేశా. ఎందుకంటే..దాని శాశ్వత చిరునామా..మన ఇరువురి హృదయాలు కదా.

Comments