బ్లాక్ ఫంగస్ భయంతో ఒక జంట ఆత్మహత్య చేసుకుంది.. లక్ష రూపాయలు దాచి మరీ..

Black Fungus;-  బ్లాక్ ఫంగస్ భయంతో ఒక జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో చోటు చేసుకుంది. కరోనా సోకిన ఈ జంట.. బ్లాక్ ఫంగస్ వస్తుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. 

ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి తనువు చాలించారు. ‘నా భార్యకు మధుమేహం. వార్తా ఛానెళ్ల ప్రకారం.. కరోనా సోకిన, డయాబెటిస్ ఉన్న రోగులందరికీ బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల శరీరంలోని అవయవాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీని చికిత్సకు భారీ మొత్తం ఖర్చు అవుతుంది. అంత మొత్తం భరించే స్థాయి మాకు లేదు. అందుకే మేం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

 AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

ఈ దంపతుల ఆత్మహత్యకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళూరుకు చెందిన రమేష్(40), గుణ సువర్ణ(35) ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. రమేష్ భార్య గుణ సువర్ణ కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతోంది. అయితే, ఇటీవల వీరిద్దరూ గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో బ్లాక్ ఫంగస్‌పై టీవీ ఛానళ్లలో వస్తున్న వార్తలు వారిని మరింత కలవరానికి గురి చేసింది. బ్లాక్ ఫంగస్ సోకితే.. చికిత్స చేయించుకునే స్థోమత లేదని హడలిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

కాగా, తమ నిర్ణయాన్ని వీడియోలో తెలుపుతూ ఆ వీడియోను మంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎన్. శశి కుమార్‌కు పంపించారు. ఆ వీడియోలో కూడా బ్లాక్ ఫంగస్‌పై భయాన్ని వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్‌ కారణంగా భయాందోళనకు గురవుతున్నామని, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామంటూ ఆ వీడియోలో దంపతులిద్దరూ తెలిపారు. ఈ వీడియోపై స్పందించిన కమిషనర్ ఎలాంటి తీవ్రమైన చర్యకు పాల్పడొద్దని ఆ దంపతులకు విజ్ఞప్తి చేశారు. ఆ దంపతులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేశారు. ఈ దంపతులను సంప్రదించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి వారు ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నారు. అయితే, అప్పటికే ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులకు ఆత్మహత్యకు బ్లాక్ ఫంగస్ కారణంతో పాటు.. వీరికి పిల్లలు పుట్టకపోవడం కూడా ఒక కారణం అని పోలీసులు గుర్తించారు.

 AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

ఇదిలాఉంటే.. ఈ దంపతులు తమ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు కూడా పేర్కొన్నారు. ‘‘మా దహన సంస్కారాలు సంప్రదాయం ప్రకారం చేయండి. దీనికోసం లక్ష రూపాయలు దాచి ఉంచాము. పోలీస్ కమీషనర్ ఎన్ శశికుమార్, శరణ్ పంప్‌వెల్, సత్యజిత్ సురత్‌కల్ మా అంత్యక్రియలకు సహకరించాలి’’ అని ఆ జంట విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. తమ ఇంట్లోని వస్తువులను పేదలకు పంచాలని సూచించారు. ఈ దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments