Whatapp;-రోజుకో కొత్త ఐడియాతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు సైబర్ కేటుగాళ్లు . అక్రమ మార్గాల ద్వారా అమాయకుల జేబులు గుళ్ల చేస్తున్నారు. తాజాగా వాట్సాప్‌ను సైబర్ చీటింగ్‌కు అస్త్రంగా మలుచుకున్నారు.
ఓ అమాయకుడి నంబర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుని.. వెంటనే సెక్యూరిటీ సెట్టింగ్స్ మార్చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ చేసి.. దాని ఆధారంగా అతడి కాంటాక్ట్స్ లిస్ట్‌ను సంగ్రహిస్తున్నారు. ఆ అమాయక వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్లో వాట్సాప్‌ను మరోసారి యాక్టివేట్ చేసుకోవాలని భావించినా.. అది సాధ్యం కాదు. ఈ క్రమంలో సైబర్ నేరస్థులు ఆ వ్యాట్సాప్ లిస్ట్‌లో ఉన్నవారికి మాల్వేర్ లింకు పంపి హ్యాక్ చేస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేయగానే వారి నంబర్లు కూడా హ్యాకింగ్‌కు గురవుతాయి.AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs , University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories
వారికి సందేశాలు పంపుతూ ఆపదలో ఉన్నామని చెబుతూ దండుకుంటున్నారు. తెలిసిన వారి నంబర్.. అందునా వ్యాట్సాప్ అందుకే మనీ సెండ్ చేసి చాలామంది మోసపోతున్నారు. అందుకే తెలిసినవారి నంబర్ల నుంచి లింకులు వచ్చినా సరే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నగరంలో గడిచిన మూడ్రోజుల్లో నలుగురు బాధితులుగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. రూ.4 లక్షలు కోల్పోయిన వీళ్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మూడు కేసులు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. .
ఎవరైనా ఒక స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను వాడుతూ… మరో ఫోన్లోకి మారితే.. ఓటీపీని పొంది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని తమకు అనువుగా మార్చుకుంటున్న చీటర్స్… కొన్ని నంబర్లతో వాట్సాప్ యాక్టివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓటీపీ అసలు మొబైల్ ఓనర్‌కు వెళ్తుంది.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs , University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories
రకరకాల పేర్లతో వారికి ఫోన్ చేసి కేటుగాళ్లు సదరు ఓటీపీలు సంపాదిస్తున్నారు. ఉదాహారణకు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేశానని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి సైబర్ నేరగాళ్లు వారి నుంచి తీసుకుంటున్నారు. ఇలా ఓటీపీని పొందగానే తమ ఫోన్లలో వారి నంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్ డీపీని కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతో పాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను ఛేంజ్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది నంబర్లు సైబర్ నేరగాళ్లు తమ అధీనంలోకి తీసుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.
Comments
Post a Comment