పెళ్లి జంట బుల్లెట్ బండి డ్యాన్స్ వైరల్....పెళ్ళికి ముందే నేను ఈ పాటకి డ్యాన్స్ వేయాలని

 సోషల్ మీడియాని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పుడు మరోసారి రుజువు చేసింది ఓ నవ వధువు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్‌కల్ గ్రామానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయ. 

ఈమె వివాహం ఈ నెల 14న ఆకుల అశోక్‌తో ఘనంగా జరిగింది. అయితే.., ఈ పెళ్లి పెళ్లి బరాత్ లో పెళ్లి కూతురు సాయి శ్రీయ డ్యాన్స్ తో ఇరగదీసింది.సింగర్ మోహన భోగరాజు పాడిన “నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా” పాటకి సాయి శ్రీయ లయబద్దంగా డ్యాన్స్ వేయడం, పెళ్లి కొడుకు అశోక్ కూడా రెండు స్టెప్పులు వేయడంతో.. 

ఈ వీడియో రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్కడ పట్టినా.., ఈ కొత్త జంట డ్యాన్స్ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఏకంగామధ్యప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి పి నరహరి కూడా ఈ వీడియోను తన ట్టిట్టర్ ఖాతాలో షేర్ చేశారంటే.., ఈ పెళ్లి జంట డ్యాన్స్ వీడియోకి ఎంత రీచ్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఈ విషయంపై ఈ పెళ్లి జంట స్పందించింది. సాయి శ్రీయ మాట్లాడుతూ.., “పెళ్ళికి ముందే నేను ఈ పాటకి డ్యాన్స్ వేయాలని నిర్ణయించుకున్నాను. బరాత్ ఈ పాటకి డ్యాన్స్ వేసి నా భర్తకి అంకితం ఇచ్చాను. అయితే.. ఈ వీడియోని నేను స్టేటస్ గా పెట్టుకున్న తరువాత..

 అంతా సోషల్ మీడియా సైట్స్ లో షేర్ చేయడం స్టార్ట్ చేశారు. చూస్తుండగానే ఈ వీడియో వైరల్ అయిపోయింది. ప్రస్తుతం.. ఈ వీడియో టాప్ ట్రెండింగ్ లో ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది” అని పెళ్లి కూతురు సాయి శ్రీయ చెప్పుకొచ్చింది.

 ఇక సాయి శ్రీయ విప్రోల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, అశోక్ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మరి.., ఈ కొత్త జంటకి మీరు కూడా కామెంట్స్ రూపంలో బెస్ట్ విషెస్ అందించండి.

 AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

Comments