ముగ్గురిపై హత్యాయత్నం...తూర్పుగోదావరి జిల్లాలో రెండు వర్గాల మధ్య

 East Godavri;- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని తూర్పు గొనగూడెం గ్రామంలో ఆస్తి తగాదా కత్తుల సమరానికి దారితీసింది. స్థలం వివాదం విషయంలో ఒక వర్గానికి చెందిన వాళ్లు, మరో వర్గానికి చెందిన వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న ముగ్గురు వ్యక్తులపై హత్యాయత్నం చేశారు.దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి.

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs గాయపడ్డ వారిని హుటాహుటీన  గ్రామ ప్రజలు అంబులెన్స్ లో రాజమహేంద్రవరం Govt ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.పగ, ప్రతీకారం.. తన అక్కను చంపేశాడనే కసి.. అతన్ని కత్తి దూసేలా చేశాయి. నడిరోడ్డుపై జనంతా తిరుగుతున్న సమయంలోనే.. బావను కింద పడేసి కత్తితో పోట్లు పొడిచాడు బావమరిది. జనగాం జిల్లా కేంద్రంలో జరిగిందీ ఘటన. ఇది ఇవాళ్టి పగ కాదు. ఐదేళ్లుగా అనుచుకున్న ప్రతీకారేచ్ఛ. అదను కోసం ఎదురుచూసి, చూసి.. పబ్లిక్‌లోనే మర్డర్‌ అటెంప్ట్‌ చేశాడు  చాలాచోట్ల జనం సినిమా చూసినట్టు చూస్తుంటారు. సెల్‌ఫోన్లలో బంధిస్తుంటారు. కానీ జనగామ జనం అలాకాదు. ముందుకు ఉరికారు. కత్తితో ఎటాక్ చేస్తున్న యువకుడిని పట్టుకున్నారు బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రక్తంమడుగులో ఉన్న బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితుడు నర్మెట మండలం ఇప్పులగడ్డ తండాకు చెందిన బానోతు చంద్రశేఖర్ గా గుర్తించారు. హత్యకు యత్నించిన యువకుడు కాజీపేటకు చెందిన ధరావత్ రమేష్ గా పోలీసులు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం తన అక్క సరితను హత్య చేసి జైలుకు వెళ్ళి వచ్చిన బావ బానోతు చంద్రశేఖర్.. పథకం ప్రకారం బావ హత్యకు స్కెచ్ వేసి కత్తితో హత్యా యత్నం చేశాడు రమేశ్ అని వెల్లడించారు.

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs

Comments