సహ జీవనంపై సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..ఆ హక్కు ఉందంటూ స్పష్టం

Punjab High Court;-మేజర్లు యువతి, యువకుడు తమ ఇష్టపూర్వకంగా సహజీనం చేసే హక్కు ఉందని పంజాబ్, హర్యానా హైకోర్టు స్పస్టం చేసింది. కుటుంబ సభ్యుల నుంచి గానీ, ఇతరుల నుంచి గానీ హానీ ఉన్నట్లయితే వారికి రక్షణ కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. చండీగఢ్ ప్రాంతానికి చెందిన యువతి(18),

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs

 మొహాలికి చెందిన యువకుడు(20) ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. దాంతో ఆ యువతి తాను ప్రేమించిన యువకుడితో ఇంట్లో నుంచి పారిపోయింది. అయితే, యువతి కుటుంబ సభ్యులు వీరి కోసం గాలిస్తుండగా.. వారు వివిధ ప్రాంతాలలో తలదాచుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారు. ఇలా అయితే కష్టం అని భావించిన ఆ ప్రేమ జంట.. పోలీసులను ఆశ్రయించింది. ఫలితం లేకపోవడంతో Court లో పిటిషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా కోరారు.వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు  సహజీవనం చేయడానికి వీరికి హక్కు ఉందని స్పష్టం చేసింది. ‘పిటిషనర్లు ఇద్దరూ మేజర్స్ అయినందున వారి ఇష్టప్రకారం జీవించే హక్కు వారికి ఉంది. స్వేచ్ఛగా జీవించడానికి, వారి ప్రాణాలను కాపాడుకోవడానికి అర్హులు. వారిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం కావున.. వారు కలిసి జీవించే హక్కు ఉంటుంది’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. పోలీసులు.ఈ జంటకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. అయితే, పెళ్లికి ముందే సహజనం నైతికంగా, సామాజికంగా సరైంది కాదని, తమ కూతురుని తమకు అప్పగించాలని ఆ యువతి కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు  తిరస్కరించింది.

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs

Comments