పరుగులు తీసిన ట్రాక్టర్ బైక్‌లను ధ్వంసం చేసేసింది....

 Medak జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో వింత ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపక్కన పార్క్ చేసిన ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. డ్రైవర్ లేకుండా దూసుకువచ్చిన ఆ ట్రాక్టర్.. Road పై ఉన్న బైక్‌లను గుద్దుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 12 బైక్‌లు ధ్వంసం కాగా. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న cc కెమెరాలో రికార్డ్ అయ్యింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్‌ పట్టణంలో రోడ్డుపై ట్రాక్టర్‌‌ను పార్క్ చేశారు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ పనిమీద పక్కానే ఉన్న షాపులోకి వెళ్లాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ట్రాక్టర్.. ఉన్నట్లుగా ఒక్కసారిగా ముందుకు కదిలింది. తొలుత నెమ్మదిగానే కదిలినప్పటికీ..

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs

 ఆ తరువాత వేగం పెరిగింది. ఈ క్రమంలో ముందు వైపు Park చేసిన బైక్‌లను ట్రాక్టర్ ఢీకొట్టింది. మొదట ఒక బైక్‌ను ఢీకొన్ని ట్రాక్టర్.. ఆ బైక్‌ను ఈడుస్తూ ముందుకు కదిలింది. అలా దాదాపు 12 బైక్‌లను ట్రాక్టర్ ఢీకొట్టింది.కాగా, ట్రాక్టర్‌ ముందుకు కదలడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు వెంటనే అప్రమత్తమై..

ఆ ట్రాక్టర్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. నలువైపుల నుంచి వచ్చి దానిని అడ్డుకునేందుకు ట్రై చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ ట్రాక్టర్‌ను ఎక్కి.. బ్రేక్ వేశాడు. దాంతో అది నిలిచిపోయింది. ప్రమాదం తప్పింది. పార్క్ చేసిన ట్రాక్టర్ ముందుకు కదలడం, బైక్‌లను ఢీకొనడం ఘటన అంతా సమీపంలో ఉన్న cc కెమెరాలో రికార్డ్ అయ్యింది. కాగా, ఈ ఘటనలో బైక్‌లు ధ్వంసం అయ్యాయి తప్ప.. మనుషులెవరూ ప్రమాదం బారిన పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs

Comments