సిలిండర్ పేలి ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు

 ఉత్తర ప్రదేశ్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా 7 మృతి, 14 మందికి గాయాలు.ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక రెండంతస్తుల భవనంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 7 మంది మరణించారు. సిలిండర్ పేలుడు కారణంగా రెండు అంతస్తుల భవనం పైకప్పు కుప్ప కూలి పోయింది. ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.కూలిపోయిన పైకప్పు కింద చిక్కుకున్న క్షతగాత్రుల్లో కొందర్ని స్థానికంగా ఉన్న గ్రామస్తులు రక్షించి ప్రజారోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


Comments