ఓ వ్యక్తి భార్య కళ్లెదుటే విద్యుత్‌ ట్రాన్‌ఫార్మర్‌ ఎక్కి అత్మహత్య


 

తాగిన మత్తులో ఓ వ్యక్తి భార్య కళ్లెదుటే విద్యుత్‌ ట్రాన్‌ఫార్మర్‌ ఎక్కి అత్మహత్య చేసుకున్నాడు అక్బర్‌ఖాన్‌ (40) మొదటి భార్యతో విడిపోయి రెండో భార్య ఆజ్మరీతో నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నాడు. మొదటి భార్యకు నలుగురు పిల్లలు కాగా, రెండో భార్యకు సంతానం లేరు.కొంత కాలంగా తాగుడికి బానిసయ్యాడు. సోమవారం మధ్యాహ్నం 01.30 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అక్బర్‌ఖాన్‌ భార్యతో కొంత కాలంగొడవపడ్డాడు.ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ బయటకు పరుగులు తీశాడు. భార్య వెంటపడితే, రాయితో కొడతానని హెచ్చరిస్తూ సమీపంలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి ఎక్కాడు. దిగమని భార్య ప్రాధేయపడినా వినకుండా విద్యుత్‌ తీగలు పట్టుకున్నాడు.ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకుని పైనుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సైదాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments