హైదరాబాద్ నగర శివారులోని వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ నగర శివారులోని వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పనామా చౌరస్తాలో ఓ బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాబాథలు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనంపై ఎల్బీనగర్ వైపు నుంచి హయత్నగర్ వెళుతున్న దంపతులను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయాలై అక్కడే మృతిచెందారు.సమాచారం అందుకున్న పోలీసులుస్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Post a Comment