ప్రియుడి కోసం భర్తను వదిలేసింది ..అడ్డుగా ఉందని కూతుర్ని చంపేసింది





 ఓ కసాయి తల్లికి కన్న కూతురు కూడా భారమైంది.ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది.మూడేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హతమార్చింది. ఎవరికి తెలియకుండా ఖననం చేసింది. మానవత్వం మంట కలిసిన ఘటన వైజాగ్లో చోటుచేసుకుంది.మారికవలస ప్రాంతానికి చెందిన వరలక్ష్మీ కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది.వీరిద్దరి సంబంధానికి మూడేళ్ల చిన్నారి అడ్డుగా ఉండటంతో వదిలించుకోవాలనుకుంది.ఇదే క్రమంలో చిన్నారిని చంపేసి సమాధి చేశారు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఊరి చివరన ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు కూడా చేసింది .అయితే, చిన్నారి అనారోగ్యంతో మృతి చెందిందని ఆమె స్థానికులతో చెప్పింది.తమ కళ్ల ముందే తిరుగుతున్న చిన్నారి ఎప్పుడు ఆనారోగ్యానికి గురైందని వారు నిలదీశారు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసుల విచారణలో వరలక్ష్మి పాపను హత్యచేసి ఖననం చేసినట్లుగా అంగీకరించింది.దీంతో ఆమెను స్మశానవాటికకు తీసుకెళ్లి ఎమ్మార్వో సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు.పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి పంపించారు.

Comments