విదేశాలలో చదువుకునే విద్యార్థులకు శుభవార్త


 

AP లో కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.చదువుల కోసం ఉద్యోగాలకోసం వీసాలపై విదేశాలకు వెళ్లేవారికీ విద్యార్థులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలని ఈ సందర్బంగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.అలాగే వారికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్‌ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.ఇది ఇలా ఉండగా కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను గుర్తించిన ఏపీ సర్కార్ … వీరిలో 43 మందికి రూ.10 laks చొప్పున డిపాజిట్‌ చేసింది. సరైన పథకాల్లో ఈ డబ్బు పొదుపు చేయడం ద్వారా భద్రత, నెలానెలా వారి మెయింటినెన్స్‌ కోసం మంచి వడ్డీ వచ్చేలా చూడాలన్న సీఎం జగన్ ఆదేశించారు.

Comments