ఏటీఎంలను చోరీ....తిన్నింటి వాసాలు లెక్కకట్టారు


 

ఏడాది నుండి కొట్టేసిన మొత్తం కోటి 39 లక్షలు ఏటీఎంలను చోరీ చేసేందుకు దొంగలు చేస్తున్న ప్రయత్నాలను వింటున్నాం ,కని ఏకంగా ఏటీఎం మిషన్లలోనే డబ్బులు డిపాజిట్ చేసే కంపెనీ ఉద్యోగులు తిన్నింటి వాసాలు లెక్కకట్టారు. అనుమానం రాకుంద అప్పుడప్పుడు కొంచెం.. కొంచెం నగదు కొట్టేస్తూ వస్తున్నారు.ఏటీఎం లావాదేవీలన్నీ గమనిస్తున్న సిబ్బందికి తరచూ కొంచెం

డబ్బు తక్కువగా వస్తోంది.డిపాజిట్ చేసేటప్పుడే తక్కువ మొత్తం పెట్టేస్తున్నారనే అనుమానం దీంతో బ్యాంకర్లు నిఘా ఉంచారు.ఇంటి దొంగల పనేనని తేలింది.మొత్తం కాకుండా.. అప్పుడప్పుడు.. కొంచెం.. కొంచెం వీలున్నప్పుడంతా కొంచెం తక్కువ మొత్తం పెట్టేస్తున్నారు. లావాదేవీల్లో ఎవరికైనా తేడా వచ్చిందేమోనని బ్యాంకర్లు అనుకునేవారు సీసీ కెమెరాలతో తనిఖీలు చేయగా ఇంటిదొంగల గుట్టు బయటపడింది.ఏటిఎంలో నగదు జమ చేసే క్రమంలో సంవత్సర కాలంగా వీరు ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు స్వాహా చేసినట్లు ఫిర్యాదు చేశారు. తమ బండారం బయటపడడంతో నలుగురు ఉధ్యోగులు పరారయ్యారు. జనగామ పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో నిందితులను పట్టుకునేందుకు చూస్తున్నారు

Comments