భార్యను హత్య చేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌

 భార్యను హత్య చేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌వివరాల్లోకి వెళితే తమిళనాడులోని క్రిష్ణగిరి సమీపంలోని దాసరపల్లి గ్రామము కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ కి 13 ఏళ్ల క్రితం రాజ్యలక్ష్మితో పెళ్ళి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.రమేష్ క్రిష్ణగిరి డ్యాం పోలీస్ స్టేషన్ లో స్పెషల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ రాయకోట రోడ్డులోని పోలీస్‌ క్వాటర్స్ లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.గత నెల 23న రమేష్ ఆతని భార్య రాజ్యలక్ష్మికి మధ్య గొడవ జరిగింది. సమయంలో అతడు అనే గొంతునులిమి హత్యచేశాడు.భార్యను హత్య చేసి సాధారణ మరణంగా నమ్మించేందుకు ప్రయతించాడు.ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అయితే అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు చెప్పడంతో రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.నేరం ఒప్పుకున్నాడు రమేష్ దీంతో అతడిపై హత్యకేసు నమోదు చేశారు పోలీసులు.


Comments