హత్య చేసి ఆర్మీ వెళ్లిపోయి ఉద్యోగంలో చేరాడు.

 


Hyd;-రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ మర్డర్ కేసును మల్కాజ్ గిరి పోలీసులు ఛేదించారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి ఆర్మీ జవాన్. అంతేకాదు విజయకుమార్ భార్యకు వరుసకు బావగా కనుగొన్నారు.తాను పెళ్లి చేసుకోవాల్సిన మరదలిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతోనే అదనుచూసి హత్య చేసినట్లు తేలింది.ఈనెల 8వ తేదీన మల్కాజిగిరిలో రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ హత్య జరిగింది. కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు ఆధారాల కోసం తీవ్రంగా శ్రమించారు.ఎట్టకేలకు సీసీ ఫుటేజీలో నిందితుడి ఆధారాలు లభించాయి. తన మరదలి భర్త అయిన విజయ్ కుమార్ ను దారుణంగా చంపిన శ్రీనివాస రెడ్డి హత్య చేసి ఏమి తెలియని వ్యక్తిగా ఉత్తరాఖండ్ రాష్టం డెహ్రాడూన్ కు వెళ్లిపోయి ఉద్యోగంలో చేరాడు.మృతుడు విజయ్ కుమార్ భార్యకు పెళ్లికాకముందు బావ అయిన గుడ్ల శ్రీనివాస్ రెడ్డి ఆర్మీ ఉద్యోగికి పెళ్లి నిశ్చయం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల పెళ్లి రద్దు కావడంతో కక్షతో 5 సంవత్సరాలుగా అవకాశం కోసం వేచి చూసాడు.మృతుని ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో విజయ్ కుమార్ ను అత్యంత దారుణంగా నరికి చంపాడు.

Comments