రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి ఇద్దరు యువతుల మృతదేహాలు

 రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి ఇద్దరు యువతుల మృతదేహాలు


 రాజమహేంద్రవరం నగరంలో ఇద్దరు యువతుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి.గోదావరి తీరాన ఇసుక ర్యాంప్‌ సమీపంలో ఇద్దరు యువతుల మృతదేహాలు కనిపించాయి.యువతుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు యువతుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి కొట్టుకు వచ్చారా మరే ఇతర కారణాలతోనైనా మరణించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Comments