పిల్లల్లో లక్షణాలు కనిపించకుండా కరోనా

 పిల్లల్లో లక్షణాలు కనిపించకుండా కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయిమూడవ వేవ్ పిల్లలపైనే విరుచుకుపడే అవకాశాలున్నాయని చెప్తున్నారు.ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు కొన్ని సూచనలు ఇచ్చింది.పిల్లలలో కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ వికె పాల్ ఈ రోజు మాట్లాడుతూ.ఈ వ్యాధి బారిన పడిన చాలా మంది పిల్లలు లక్షణరహితంగా ఉన్నారు.మొదట, చిన్నారులలో న్యుమోనియా లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రెండవది, ఇటీవల కోవిడ్ 19 నుండి కోలుకున్న పిల్లలలో మల్టీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా కనిపించాయి.” అని ఆయన చెప్పారు.రెండవ పరిస్థితిని వివరిస్తూ, చాలా అరుదైన సందర్భాల్లో, కోవిడ్ నుండి కోలుకున్న ఆరు వారాల తరువాత, కొంతమంది పిల్లలకు మళ్లీ జ్వరం వస్తుంది, దద్దుర్లు అలాగే, తులు కూడా వస్తాయని ఆయన చెప్పారు.మేము ఈ విషయాలను పరిశీలిస్తున్నాము. ఇటువంటి కోవిడ్ అనంతర లక్షణాలను నిర్వహించడానికి మా వైద్యులు, శిశువైద్యులు బాగా శిక్షణ పొందారు” అని ఆయన వివరించారు.


Comments