రైలుపైకెక్కి సెల్ఫీ తీసుకుంటూ



వెరైటీ సెల్ఫీ కోసం ప్రాణాలు పణంగా పెట్టాడు రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునే క్రమంలో క్షణాల్లోనే కల్లి బూడిదైపోయియాడు.ఎంతో భవిష్యత్, తల్లిదండ్రుల ఆశలు నడుమ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న నవయువకుడు ఇలా తన నిండు ప్రాణం పోగొట్టుకున్నాడు.ఒడిశా రాష్టం పర్లాకిమిడికి చెందిన ' సూర్జి కుమార్ 'అనే విద్యార్థి రైలు పైన వున్న విద్యుత్ వైర్లు కు తగిలి మృతి చెందాడు .ఆ క్రమంలో చెలరేగిన అగ్గి రవ్వలు ఆగి వున్న రైలు పై పడి పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడిషా రాష్ట్రంలోని గుణుపూర్ వెళ్లే పాసింజర్ రైలును కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా పర్లాకిమిడి రైల్వేస్టేషన్ వద్ద నిలిపివేశారు రైల్వే అధికారులు.గత రాత్రి సరదాగా సెల్ఫీ కోసమై రైలుబోగి ఎక్కిన సూర్జి కుమార్ చేతులారా ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు.అయినా సెల్ఫీ అంటే సరదాగా ఉండాలి గానీ.. ప్రాణాలు తీసేంత వయిలెంట్‌గా ఎందుకు.ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాలి.



Comments