పెళ్లి రద్దయిందని ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని 

తన వివాహం రద్దు చేయబడిందని భావించి ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటుంది. అలీయాబాద్‌కు చెందిన లక్ష్మణ్ కుమార్తె అనుషా (22) ముదుచింటలపల్లికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిశ్చితార్థం జరిగిందని షమీర్‌పేట్ పోలీసులు తెలిపారు.అయితే ఈ మధ్యనే కొన్ని కారణాల వల్ల వివాహం రద్దు చేయబడింది. దీంతో అనుష తన వివాహం రద్దు చేయబడిందని చాలా బాధపడింది.గురువారం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. షమీర్‌పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు.షమీర్‌పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.అయితే వివాహం రద్దు అయిన వెంటనే యువతి ఆత్మహత్య చేసుకుందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా ..? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments